గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 11 డిశెంబరు 2023 (09:48 IST)

మెగా స్టార్ చిరంజీవితో గ్యాంగ్ లీడర్ లాంటి సినిమా చేస్తనంటున్న సందీప్ రెడ్డి వంగా

chiru-sandeep
chiru-sandeep
యానిమల్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజాగా అమెరికా టూర్ లో వున్నారు. అక్కడ ఈ సినిమాకు వస్తున్న ఆదరణతో ఉబ్బి తబ్బిబయ్యారు.  అక్కడ ఎవరూ మహిళ గురించి చిన్న చూపుగా తీశారని అడగనందుకు చాలా ఆనందంగా వుందని పేర్కొన్నారు. సినిమాను సినిమాగా చూడాలనుకున్న మీ ఆలోచనకు ఫిదా అయినట్లు తెలిపారు. ఇక పనిలో పనిగా చిరంజీవి ప్రస్తావన వచ్చింది.
 
మెగాస్టార్ చిరంజీవి అభిమానిగా మొదట్లోనే చెప్పిన సందీప్ రెడ్డి వంగా చిరంజీవిగారితో సినిమా చేస్తే యాక్షన్ డ్రామా సినిమాకి దర్శకత్వం వహించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటూ ట్వీట్ చేశాడు. గ్యాంగ్ లీడర్ స్టిల్ ను చూపించి ఈ తరహా వుండాలనుకుంటున్నట్లు సూచాయిగా చెప్పారు. ఇదిలా వుండగా యానిమల్ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఆరువందల కోట్ల గ్రాస్ కు చేరుకోనున్నంది.