బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 4 డిశెంబరు 2023 (11:14 IST)

త్రిష పై నెటిజన్లు ఫైర్ , వెంటనే పోస్ట్ ను తొలగించిన త్రిష

Trisha
Trisha
మహిళల సాధికారిత మహిళల ఆత్మ గౌరవం అని మాటలు మాట్లాడే హీరోయిన్లు ఇటీవలే యానిమల్ సినిమాపై పెద్ద ప్రశంసలు కురిపించారు. అందులో త్రిష ముందుంది. ఈ సినిమాలో ఆడవారిని చాలా చులకన భావంతో చూపారనీ, ఇలాంటి సినిమాను ఎందుకు ఆదరిస్తున్నారో అని కొంతమంది నెటిజనులు కామెంట్లు చేస్తున్నారు.
 
అందుకు త్రిష మాత్రం ‘ఒకటే పదం-కల్ట్’ అంటూ తన ఇన్‌స్టా లో పోస్ట్ పెట్టింది. దీనిపై నెటిజన్లు ఘాటుగా స్పందించడంతో వెంటనే పోస్ట్ ను తొలగించింది. ఇక రెండో రోజు కలెక్షన్లను చిత్ర యూనిట్ ప్రకటించింది.  దాదాపు 236 కోట్లు వచ్చినట్లు ప్రకటించారు. త్రిష కామెంట్లు తెగ వైరల్ అవుతున్నాయి. మరికొందరైతే ఇలాంటి సినిమాలు చూస్తే యువత కచ్చితంగా పక్కదోవ పడతారని వాదిస్తున్నారు. సో. దీనికి కాలమే సమాధానం చెప్పాలి.