విరాజ్ అశ్విన్‌కు జోరుగా హుషారుగా గోత గోవిందం అమవుతుంది: దర్శకుడు అనుప్రసాద్
కథానాయకుడు విరాజ్ అశ్విన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం జోరుగా హుషారుగా. పూజిత పొన్నాడ కథానాయిక. అను ప్రసాద్ దర్శకుడు. శిఖర అండ్ అక్షర ఆర్ట్స్ ఎల్ఎల్‌పీ పతాకంపై నిరీష్ తిరువిధుల నిర్మిస్తున్నారు. యూత్‌ఫుల్ అండ్ ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం రేపు డిసెంబరు 15న విడుదల కాబోతోంది. ఈ సందర్బంగా చిత్ర దర్శకుడు అనుప్రసాద్‌తో జరిపిన ఇంటర్వ్యూ ఇది.
దర్శకుడిగా తొలిసినిమా టెన్షన్‌గా వుందా?
సినిమా మీద వున్న నమ్మకం వున్న ఎదో తెలియని టెన్షన్ వుంది. ఎందుకంటే దర్శకుడిగా పరిచయం కావడమనేది నా ఎనిమిదేళ్ల కల. ఈ రోజు కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నాను. తప్పకుండా సినిమా అందరిని అలరిస్తుందనే విశ్వాసం వుంది.
మీ నేపథ్యం ఏమిటి?
ఈస్ట్ గోదావరి జిల్లాలోని పెద్దాపురం మాది. చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఇష్టం. అందుకే చదువు పూర్తయిన తరువాత జాబ్ వదిలేసి సినిమా రంగంలోకి వచ్చాను. అవకాశం కోసం లైట్‌మెన్‌గా, జూనియర్ ఆర్టిస్ట్‌గా కూడా పనిచేశాను. షార్ట్ ఫిలింస్‌లో నా ప్రతిభ చూసి దర్శకుడిగా నిరీష్‌గారు నాకు ఈ అవకాశం ఇచ్చారు.
జోరుగా హుషారుగా ఎలాంటి చిత్రం?
ఇది కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. ఎమోషన్, కామెడీతో పాటు మంచి సంగీతంతో కూడిన సినిమా ఇది. సాధారణ జీవితంలో ఒక మిడిల్‌క్లాస్ అబ్బాయికి జరిగే అన్ని సంఘటనలు ఈ చిత్రంలో వుంటాయి. విలేజ్ నుంచి సిటీకి వచ్చిన సంతోష్ అనే కుర్రాడు ఎలాంటి సంఘటనలు ఎదుర్కొంటాడు? దాని వల్ల అతని జీవితంలో జరిగే మార్పులేమిటి? అనేది ఆసక్తికరంగా వుంటుంది. తనకు ఎదురైన సంఘటనల నుంచి అతను ఎలా బయటపడ్డాడు ? తన ఫ్యామిలీని ఎలా సేవ్ చేశాడు అనేది ఎమోషన్‌తో కనెక్ట్ వుంటూనే ఎంటర్‌టైన్‌మెంట్ వేలో చూపించాను
సాయికుమార్ గారి పాత్ర ఎలా వుంటుంది?
సూర్య నారాయణ అనే చేనేత కార్మికుడు పాత్రలో కనిపిస్తాడు. ప్రేమను మనసులో దాచుకుంటాడు. చిత్రంలో ఈ పాత్ర కీలకంగా వుంటుంది. విరాజ్‌కు తండ్రి పాత్రలో కనిపిస్తాడు.
ఈ చిత్రంలో కొత్తదనం ఏమిటి?
ఈ చిత్రంలో వుండే ఓ యూనిక్ పాయింట్, ఎమోషన్ ప్రతి మిడిల్ క్లాస్ అబ్బాయికి కనెక్ట్ అవుతుంది. ఇప్పటి వరకు ఏ సినిమాలో టచ్ చేయని ఓ పాయింట్‌ను ఇందులో టచ్ చేశాం. ప్రేక్షకులకు కావాల్సిన ఎంటర్‌టైన్‌మెంట్ ఎమోషన్ ఈ చిత్రంలో వుంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ నవ్వుతూ థియేటర్ నుంచి బయటికొస్తారు.
జోరుగా హుషారుగా టైటిల్ జస్టిఫికేషన్ ఏమిటి?
సినిమాలో పాత్రలన్నీ సరదాగా వుంటాయి. సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకులు కూడా హ్యపీగా వుంటారు. అందుకే ఆ టైటిల్ పెట్టాం.
బేబి లాంటి ఓ కల్ట్ లవ్‌స్టోరీ తరువాత విరాజ్ అశ్విన్ నటించిన ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను రీచ్ అవుతుందా?
విజయ్ దేవరకొండకు అర్జున్‌రెడ్డి తరువాత గీత గోవిందం సినిమా ఎలాంటి ఇమేజ్ తెచ్చిందో, విరాజ్ అశ్విన్‌కు బేబి తరువాత జోరుగా హుషారుగా అలాంటి చిత్రమవుతుంది.