శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 24 నవంబరు 2023 (16:40 IST)

విజయ్ దేవరకొండ- రష్మికల ప్రేమ.. లీక్ చేసిన రణ్‌బీర్?

Rashmika Mandanna
తెలుగు యువ నటుడు విజయ్ దేవరకొండ- రష్మిక మందన్న చాలా కాలంగా ప్రేమలో ఉన్నారని టాలీవుడ్‌లో పుకార్లు వస్తున్నాయి. విజయ్ ఫ్యామిలీ ఈవెంట్స్‌లో రష్మిక మందన్న కనిపించడం, కలిసి టూర్‌లకు వెళ్లడం, సోషల్ మీడియాలో తరచూ ఒకరిపై ఒకరు ప్రశంసలు కురిపించడం వంటివి వారి ప్రేమకథ నిజమేననే పుకార్లు వ్యాపించాయి. 
 
యానిమల్ ప్రమోషన్స్‌లో భాగంగా బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షోకు రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్న, సందీప్ వంగ హాజరయ్యారు. ఈ షోలో రష్మికకు అర్జున్ రెడ్డి, రణబీర్ కపూర్ యానిమల్ సినిమా పోస్టర్లను చూపించాడు. ఇందులో ఎవరి పోస్టర్ బాగుందని రష్మికను బాలకృష్ణ అడిగారు. రెండు పోస్టర్లు బాగున్నాయంటూ రష్మిక చెప్పిన సమాధానంతో బాలకృష్ణ సంతృప్తి చెందలేదు. 
 
అలాంటి పొలిటికల్ డైలాగులు లేవని ఆమెపై సెటైర్లు వేశారు. బాలకృష్ణ సందీప్ రెడ్డి వంగా విజయ్‌కి ఫోన్ చేయమని చెప్పాడు. సందీప్‌రెడ్డి ఫోన్‌ కాల్‌ను విజయ్‌ ఎత్తలేదు. తర్వాత విజయ్ సందీప్ వంగా కాల్‌ని పికప్ చేసి బాలకృష్ణతో కాసేపు మాట్లాడాడు. ఆ తర్వాత రష్మికకు ఫోన్ ఇచ్చాడు. ఫోన్ స్పీకర్‌లో ఉందని రష్మిక విజయ్‌కి నవ్వు తెప్పించింది.
 
అర్జున్ రెడ్డి సక్సెస్ పార్టీలో రష్మిక మందన్న మొదటిసారి విజయ్ దేవరకొండను కలిసిందని, విజయ్ దేవరకొండ ఇంట్లో పార్టీ జరిగిందని రణబీర్ కపూర్ సీక్రెట్‌ను తెలిపింది. రష్మికను ఆ పార్టీలోకి ఎవరు ఆహ్వానించారని బాలకృష్ణ ప్రశ్నించారు. షోను నవ్వించిన ఈ సమాచారాన్ని ఎవరు లీక్ చేస్తున్నారో తనకు తెలియదని రష్మిక అన్నారు.