సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 18 నవంబరు 2023 (16:30 IST)

బుర్జ్ ఖలీఫా వద్ద యానిమల్ స్పెషల్ కట్ ప్రదర్శన

Ranbir Kapoor, Bobby Deol and others
Ranbir Kapoor, Bobby Deol and others
రణబీర్ కపూర్ నటించిన ‘యానిమల్’ చిత్రం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం బుర్జ్‌ ఖలీఫా వద్ద అద్భుతం సృష్టించింది. దుబాయ్ లోని ఐకానిక్ బుర్జ్ ఖలీఫా వద్ద జరిగిన లార్జ్ దెన్ లైఫ్, గ్రాండ్ ఈవెంట్ లో బుర్జ్‌ ఖలీఫా పై యానిమల్ స్పెషల్ కట్ ని ప్రదర్శించారు.
 
రణ్‌బీర్ కపూర్, బాబీ డియోల్‌తో పాటు నిర్మాత భూషణ్ కుమార్ వేదికపై సందడి చేశారు. ఈ అద్భుతాన్ని చూడటానికి పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. సహా నిర్మాతలు శివ చనన, ప్రణయ్ రెడ్డి వంగా కూడా ఈ గ్రాండ్ ఈవెంట్‌ లో పాల్గొన్నారు.
 
ఇటీవలే ఈ చిత్రం మాన్‌హాటన్ ఐకానిక్ టైమ్స్ స్క్వేర్‌లో సందడి చేసింది. ఆక్కడి డిజిటల్ బిల్‌బోర్డ్‌లపై  ప్రదర్శించిన టీజర్ అందరీ ఆకట్టుకోవడంతో యానిమల్ గ్లోబల్ దృష్టిని ఆకర్షించింది.
 
తాజాగా బుర్జ్ ఖలీఫా ఈవెంట్ యానిమల్ గ్రాండియర్ కి ప్రతీకగా నిలుస్తూ..లార్జర్-దేన్-లైఫ్ నెరేటివ్ కి సరైన కాన్వాస్‌ను అందించి సినిమా కోసం మరింత ఎక్సయిటింగ్ గా ఎదురుచూసేలా చేసింది.
 
యానిమల్‌లో రణబీర్ కపూర్, బాబీ డియోల్, రష్మిక మందన్న, అనిల్ కపూర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భూషణ్ కుమార్, కృష్ణ కుమార్ టి-సిరీస్, మురాద్ ఖేతాని సినీ1 స్టూడియోస్ , ప్రణయ్ రెడ్డి వంగా భద్రకాళి పిక్చర్స్ యానిమల్‌ చిత్రాన్ని నిర్మించాయి. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించారు. ప్రేక్షకులకు గొప్ప థ్రిల్ రైడ్ ని అందించే ఈ క్రైమ్ డ్రామా డిసెంబర్ 1, 2023న  గ్రాండ్ గా విడుదల కానుంది.