మంగళవారం, 5 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 30 ఆగస్టు 2024 (08:45 IST)

తెలంగాణ రాష్ట్రంలో మూడు రోజుల పాటు అతి భారీ వర్షాలు..

Rains
తూర్పు, మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం కారణంగా తెలంగాణ రాష్ట్రంలో శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రంలోని 4 నుంచి 11 జిల్లాలకు ఈ తరహా వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అందువల్ల ఆయా జిల్లాల యంత్రాంగాలు, కలెక్టర్లు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పలు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీచేసింది. 
 
కాగా, అల్పపీడనం ప్రభావం కారణంగా తెలంగాణలో శుక్రవారం నుంచి 3 రోజుల పాటు పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలోని 4 నుంచి 11 జిల్లాల్లో ఇలా అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని, ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మిగిలిన జిల్లాల్లో ఓ మోస్తరు వర్షం పడొచ్చని ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. 
 
తూర్పు, మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి వాయవ్యంలో కేంద్రీకృతం అయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. శనివారం వరకు ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశావైపు కదిలే క్రమంలో బలపడి వాయుగుండంగా మారవచ్చని పేర్కొంది. 
 
కాగా, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే జిల్లాలను పరిశీలిస్తే, శుక్రవారం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, జగిత్యాల, మంచిర్యాల, శనివారం కొత్తగూడెం, ఖమ్మం, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, హన్మకొండ, వరంగల్, ఆదివారం జగిత్యాల, సిరిసిల్ల, నిజామాబాద్, ఖమ్మం, కొత్తగూడెం, జనగామ, సిద్దిపేట, మహబూబాబాద్, యాదాద్రి, కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది.