బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 15 అక్టోబరు 2024 (20:30 IST)

అదృశ్యమైన ఏడేళ్ల బాలిక- బ్యాగులో కుక్కివున్న స్థితిలో..?

rape
శనివారం నుంచి అదృశ్యమైన ఏడేళ్ల బాలిక మృతదేహం మంగళవారం మేడ్చల్‌లోని గుండ్లపోచంపల్లిలో బ్యాగులో కుక్కివున్న స్థితిలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతురాలైన బాలిక కుటుంబం పని కోసం ఏడు నెలల క్రితం ఆదిలాబాద్‌ నుంచి నగరానికి వచ్చి సూరారంలో ఉంటోంది. ఆమె తల్లిదండ్రులు భవన నిర్మాణ కార్మికులు. 
 
ఈ నేపథ్యంలో అక్టోబర్ 12న బాలిక కనిపించకుండా పోయిందని, దీంతో కుటుంబ సభ్యులు సూరారం పోలీసులకు ఫిర్యాదు చేశారని పోలీసు వర్గాలు తెలిపాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

గుండ్లపోచంపల్లిలోని బాసరగడిలో బ్యాగులో ఆమె మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు. ఈ ఘటనకు సంబంధించిన దర్యాప్తులో భాగంగా ఘటనాస్థలికి వెళ్లే రహదారుల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.