శనివారం, 24 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 9 డిశెంబరు 2023 (20:30 IST)

కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా వుంది.. వైద్యులు

kcrao
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆరోగ్యం నిలకడగా వుందని వైద్యులు తెలిపారు. కేసీఆర్ సోమాజీగూడలోని యశోద ఆస్పత్రిలో శుక్రవారం నాడు కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఆధ్వర్యంలో కేసీఆర్‌కు 20 మంది వైద్యుల బృందం సర్జరీ పూర్తి చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యుల బృందం తెలిపింది. 
 
కేసీఆర్ ఆరోగ్యానికి సంబంధించిన హెల్త్‌ బులెటిన్‌ను సోమాజీగూడలోని యశోద ఆస్పత్రి వైద్యులు విడుదల చేశారు. కేసీఆర్‌కి తుంటి నొప్పి తగ్గిందని రోజంతా విశ్రాంతి తీసుకున్నారని చెప్పారు. 
 
అంతర్జాతీయ అంబులేషన్ మార్గదర్శకాల ప్రకారం హిప్ రీప్లేస్ సర్జరీ చేసుకున్న వ్యక్తిని 12గంటల లోపు నడిపించాలని అందులో భాగంగానే కేసీఆర్ కొంత సమయం నడిచారని వైద్యుల బృందం తెలిపింది.