శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 6 జనవరి 2024 (22:29 IST)

హైదరాబాద్ : స్పా ముసుగులో పాడు పనులు- ఆరుగురి అరెస్ట్

woman
హైదరాబాద్ మహా నగరంలో స్పా ముసుగులో పాడు పనుల దందాను పోలీసులు గుర్తించారు. గుడిమల్కాపూర్‌లోని స్పా సెంటర్లపై సౌత్ వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భాగంగా ఐదు మంది యువతులను రెస్క్యూ చేయగా, ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. 
 
స్పా నిర్వహకులపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వివిధ ప్రాంతాలకు చెందిన యువతులను ఉద్యోగం పేరిట హైదరాబాద్‌కు రప్పించి, ఈ వృత్తిలోకి దింపి వ్యభిచారంలోకి నేడుతున్నట్లు పోలీసులు తెలిపారు. బంజారా హిల్స్, జూబ్లీహిల్స్‌లో స్పా సెంటర్ లో మాటను ఈ గలీజ్ దందాకు పాల్పడుతున్నట్లు వెల్లడించారు.