శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 6 జనవరి 2024 (22:22 IST)

లారీ డ్రైవర్ అతివేగం- ఆటో-బైక్ ఢీ.. చిన్నారితో ఆరుగురు మృతి

car accident
మహబూబ్‌నగర్ జిల్లాలోని బాలానగర్ వద్ద లారీ డ్రైవర్ అతివేగంతో ఆటో, బైక్‌ని ఢీకొనడంతో ఒక చిన్నారితో సహా ఆరుగురు మరణించారు. ఇద్దరు తీవ్ర గాయాలయ్యాయి. దీనితో ఆగ్రహించిన జనం లారీకి నిప్పుపెట్టి, రోడ్డుపై నిరసన తెలిపారు.
 
మరోవైపు శనివారం తెలంగాణ ఆర్టీసీకి చెందిన రాజధాని బస్సు ప్రమాదానికి గురైంది. హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్తున్న టీఎస్ ఆర్టీసీ రాజధాని బస్సు ప్రమాదానికి గురైంది. 
 
ఈ బస్సులోని ప్రయాణికుల్లో ఆరుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలు కాగా.. మిగిలిన వాళ్లంత సురక్షితంగా బయటపడ్డారు. రాజధాని బస్సు ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో, అంతేకాక పెద్ద గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.