సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 25 జులై 2023 (13:38 IST)

ట్రక్కుకు 4 కెమెరాలు అమర్చిన డ్రైవర్.. ఎందుకో తెలుస్తే విస్తుపోతారు...

Lorry
Lorry
ఒక లారీ డ్రైవర్ తాను నడిపే లారీ ట్రక్కుకు నాలుగు కెమెరాలను అమర్చాడు. ఇలా ఎందుకు అమర్చాడో తెలుసుకున్న పోలీసులతో పాటు కొందరు వ్యక్తులు విస్తుపోయారు. ఈ ఘటన జపాన్ దేశ రాజధాని టోక్యో నగరంలో వెలుగు చూసింది. ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ నగరానికి చెందిన సతోషి నిషిముర అనే వ్యక్తి ఓ ట్రక్కు డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. ఈయన సరకు రవాణా నిమిత్తం టోక్యో నుంచి వివిధ ప్రాంతాలకు ప్రయాణిస్తుంటాడు. ఇంతవరకు అంతాబాగానే వుంది. కానీ, నిషిముర ట్రక్కుకు చుట్టూ నాలుగు కెమెరాలు అమర్చాడు. ఆ కెమెరాలు ఎందుకో తెలుసుకున్న పోలీసులు దిగ్భ్రాంతికి గురయ్యారు. 
 
జపాన్‌లో దుస్తులు ధరించే విధానం పాశ్చాత్య దేశాలను పోలి ఉంటుంది. జపాన్ అమ్మాయిలు స్కర్టులను అధికంగా ధరిస్తుంటారు. నిషిముర ఏం చేసేవాడంటే... రోడ్డుపై స్కర్టు ధరించిన అమ్మాయిలు కనిపిస్తే చాలు... తన ట్రక్కును వారికి సమీపానికి పోనిచ్చేవాడు. ఆ ట్రక్కు చుట్టూ అమర్చిన కెమెరాలతో అమ్మాయిల స్కర్టు లోపలి శరీర భాగాలను చిత్రీకరించేవాడు. ఇలా, గత 11 ఏళ్లుగా నిషిముర ఈ తరహా వీడియో రికార్డింగ్‌లు చేస్తున్నాడు. 
 
ఈ క్రమంలో ఇటీవల ఓ మహిళ కొన్ని వీడియోలను చూసింది. అందులో తాను స్కర్టు ధరించినప్పటి దృశ్యాలతో పాటు కొన్ని అసభ్యకరంగా ఉన్న వీడియోలు ఉండటాన్ని గమనించింది. దాంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిషిముర విపరీత చర్యలు వెలుగులోకి వచ్చాయి.