బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 19 జులై 2023 (10:32 IST)

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం.."మిథునం" కథా రచయిత శ్రీరమణ మృతి

sriramana
తెలుగు చిత్రపరిశ్రమలో మరో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కథా రచయిత శ్రీరమణ మృతి చెందారు. ఆయన వయసు 71 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపుడుతూ వచ్చిన ఆయన.. బుధవారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు. ఈయన 'మిథునం' చిత్రానికి కథను సమకూర్చారు. ఈయన సినీ కథా రచయితగానే కాకుండా, వ్యంగ్య వ్యాసకర్తగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు సినీ పరిశ్రమ దిగ్గజాలైన బాబు, రమణలతో ఆయన కలిసి పని చేశారు. 
 
2014లో హాస్య రచన విభాగంలో తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ఆయన కీర్తి పురస్కారాన్ని స్వీకరించారు. పత్రిక అనే మాస పత్రికకు ఆయన గౌరవ సంపాదకుడిగా వ్యవహిరించారు. కాలమిస్టుగా, కథకుడిగా, సినీ రంగంలో నిర్మాణ నిర్వహణపరంగా ఆయనకు మంచి పేరుతో పట్టుంది. ఇదే సమయంలో సాహిత్య, కళా రంగాల్లో తనదైనసేవ చేశారు. శ్రీరమణ సొంతూరు గుంటూరు జిల్లాలోని వేమూరు మండలం, వరహాపురం అగ్రహారం. ఆయన మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని సానుభూతిని తెలియజేస్తున్నారు.