శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 1 ఏప్రియల్ 2023 (16:41 IST)

నాని దసరా రెండో రోజు కలెక్షన్లు 53 కోట్లు

dasara 2days collectons
dasara 2days collectons
నాని నటించిన దసరా సినిమా మొదటిరోజు కలెక్షన్లు అనూహ్యంగా రావడంతో సినిమాపై ఆశలు పెంచుకున్నారు. శ్రీరామనవి సందర్భంగా విడుదలైన ఈ సినిమా పాన్‌ ఇండియాగా విడుదలై ఓవర్ సీస్ తో సహా అన్నిచోట్ల కలిపి రెండోరోజు నాటికి 53 కోట్లు గ్రాస్ రాబట్టిందని చిత్ర నిర్మాణ సంస్థ ఎస్‌.ఎల్‌.వి. క్రియేషన్స్‌ తెలియజేసింది. ఈ సినిమా ముందురోజు ఎన్నో అంచనాలతో పబ్లిసిటీతో విడుదలైంది. కొన్ని చోట్ల డివైడ్‌ టాక్‌ రావడంతో కలెక్షన్లు సాదారణంగా వున్నాయి.
 
గురువారం నుంచి ఆదివారం వరకు సెలవు దినాలు, విద్యార్థులకు సమ్మర్‌ హాలిడేస్‌ ఇవ్వడంతో ఈ సినిమా కలెక్షన్లపై మరింత ఆశలు పెంచుకున్నారు. మొదటిరోజు కలెక్షన్లను చూశాక ప్రభాస్‌, మహేష్‌బాబు తోపాటు పలువురు నానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ రోజు అనగా శనివారంనాడు కన్నడ హీరో యశ్‌ కూడా నానికి విషెస్‌ చెబుతూ, గెటప్‌ బాగుందని పోస్ట్‌ చేశాడు. ఇందుకు నాని మీ రెస్సాన్స్‌కు థ్యాంక్స్‌ అంటూ బదులిచ్చారు.
 
తెలంగాణా నేపథ్యం గనుక దసరాను నైజాంలో బాగానే కలెక్షన్లు వసూలు అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో కూడా కొన్ని చోట్ల సాధారణ కలెక్షన్లు వున్నాయని ట్రేడ్‌ వర్గాలు తెలియజేస్తున్నాయి. కానీ పాన్‌ ఇండియా సినిమాగా విడుదలైన నార్త్‌లో మాత్రం అనుకున్నంతగా వసూళ్ళు రాబట్టలేదని తెలుస్తోంది.