శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 22 నవంబరు 2023 (21:31 IST)

ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం: వేగంగా వెళ్తున్న లారీని ఢీకొట్టి స్కూలు పిల్లల ప్రాణాల మీదకి తెచ్చాడు

road accident
కొందరు ఆటోడ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల వాటిలో ప్రయాణిస్తున్నవారి ప్రాణాల మీదకు వస్తోంది. బుధవారం నాడు విశాఖ నగరంలో సంగం శరత్ థియేటర్ కూడలి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. మెయిన్ రోడ్డుపై వేగంగా వెళ్తున్న లారీని స్కూలు పిల్లలను ఎక్కించుకుని వెళ్తున్న ఆటో ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. ఇద్దరి పరిస్థితి విషమంగా వుంది.
 
రైల్వే స్టేషను నుంచి సిరిపురం వైపు విద్యార్థులతో వెళ్తున్న ఆటో... వేగంగా వస్తున్న లారీని ఢీకొన్నది. దీంతో ఆటో మూడు పల్టీలు కొట్టింది. ఆటోలో స్కూలు వెళ్తున్న ఏడుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ చిన్నారులను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా వుంది. లారీ డ్రైవర్, క్లీనర్ పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు.