1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 22 అక్టోబరు 2023 (12:06 IST)

జార్ఖండ్‌లో పానీపూరి ఆరగించి 50 మందికి అస్వస్థత - వీరిలో చిన్నారులు కూడా..

paanipoori
జార్ఖండ్ రాష్ట్రంలో ఓ విషాదకర ఘటన జరిగింది. పానీపూరి ఆరగించిన 50 మంది చిన్నారులు అస్వస్థతకు లోనయ్యారు. వీరిలో పది మంది మహిలలు కూడా ఉన్నారు. ఈ ఘటన కోడెర్మా జిల్లాలో జరిగింది. శుక్రవారం సాయంత్రం లోకై పంచాయతీ పరిధిలోని గోసైన్ తోలా ప్రాంతంలో వీధి వ్యాపారి వద్ద కొనుగోలు చేసిన పానీపూరీలు ఆరగించిన వారంతా అస్వస్థతకు లోనయ్యారు. ఆ తర్వాత వారంతా అస్వస్థతకు లోనయ్యారు. 
 
ఈ పానీపూరీలు ఆరగించిన వారంతా వాంతులు, విరేచనాలతో అనారోగ్యం పాలయ్యారు. అస్వస్థకు గురైన వారిలో 40 మంది పిల్లలు, పది మంది మహిళలు కూడా ఉన్నారు. వారిని చికిత్స కోడెర్మాలోని సదర్ ఆస్పత్రికి తరలించారు. కాగా, కలుషిత ఆహారం ఆరగించడం వల్లే వారంతా అస్వస్థతకు లోనైట్టు వైద్యాధికారులు వెల్లడించారు. అనారోగ్యంపాలైన వారిలో 9 నుంచి 15 యేళ్ల వయసు కలిగిన పిల్లలు ఉన్నట్టు తెలిపారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉందని వెల్లడించారు. మరోవైపు వీధి వ్యాపారి నుంచి ఫుడ్ శాంపిల్స్ సేకరించి, వాటిని రాంచీలోని ప్రయోగశాలకు పంపించారు.