1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 16 అక్టోబరు 2023 (16:20 IST)

చపాతీ, దోస పిండిలో అవిసె గింజల పొడిని కలుపుకుంటే?

Flax seds
Flax seds
అవిసె గింజలు స్త్రీలలో రుతుక్రమ సమస్యల నుండి ఉపశమనం పొందేలా చేస్తుంది. ఇది ఈస్ట్రోజెన్ సంబంధిత రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.అవిసె గింజలో లిగ్నాన్స్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది ఫైటోఈస్ట్రోజెనిక్ లక్షణాలను కలిగి ఉంటుంది.
 
అవిసె గింజలు ఈస్ట్రోజెనిక్, యాంటిస్ట్రోజెనిక్ ప్రభావాలను కలిగి ఉంటాయి. ఇవి మొత్తం ఈస్ట్రోజెన్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి.
 
 అవిసె గింజలు స్త్రీలకు జుట్టు, చర్మానికి సహాయపడటమే కాకుండా పీరియడ్స్ క్రమబద్ధీకరిస్తాయి. దీని ప్రయోజనాల్లో బరువు తగ్గడం కూడా ఉన్నాయి. ఇందులో ఒమేగా కొవ్వులు, ఫైబర్‌ వుండటం వల్ల సంతృప్త విలువను అందిస్తాయి.
 
అవిసె గింజలలోని లిగ్నన్లు శరీరంలోని హార్మోన్ల జీవక్రియను ప్రభావితం చేస్తాయి. ఇది ఈస్ట్రోజెన్ల శక్తిని తగ్గిస్తుంది. వారిని బలహీనపరుస్తుంది. అదనపు ఈస్ట్రోజెన్ వల్ల కలిగే సమస్యలను తొలగించడంలో సహాయపడుతుంది. 
 
అందుచేత మహిళలు ప్రతిరోజూ 2 టీస్పూన్ల అవిసె గింజలను తీసుకోవాలి. అవిసె గింజలను ఎండబెట్టి పొడి చేసుకుని వాడుకోవచ్చు. ప్రతిరోజూ వివిధ ఆహారాలతో పాటు తినవచ్చు. లేదా చపాతీ, దోస పిండిలో కలుపుకోవచ్చు. ఇడ్లీ, దోసెలకు పొడి మసాలాగా ఉపయోగించవచ్చునని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.