గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 18 అక్టోబరు 2023 (14:27 IST)

యూజీసీ గుడ్ న్యూస్.. యూజీసీ ఫెలోషిప్‌ పెంపు

ugclogo
యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, సైన్స్, హ్యుమానిటీస్, సోషల్ సైన్సెస్‌లో సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, సింగిల్ గర్ల్ చైల్డ్ కోసం సావిత్రిబాయి జ్యోతిరావు ఫూలే ఫెలోషిప్, డాక్టర్ డిఎస్ కొఠారి పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్ (DSKPDF), పోస్ట్-పొందిన ఫెలోషిప్ మొత్తాలను సవరించింది. 
 
జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ మొత్తాన్ని రెండేళ్లపాటు నెలకు రూ.31,000 నుంచి రూ.37,000కు పెంచగా, మిగిలిన కాలానికి సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ మొత్తాన్ని రూ.35,000 నుంచి రూ.42,000కు పెంచారు.
 
ఇంకా పోస్ట్‌ డాక్టోరల్‌ ఫెలోషిప్‌ కోసం మూడేళ్లపాటు రూ.47వేల నుంచి రూ.54 వేల వరకు ఇస్తుండగా.. దాన్ని రూ.58 వేల నుంచి రూ.67 వేలకు పెంచారు. ఈ మొత్తం పోస్ట్‌ డాక్టోరల్‌ ఫెలోషిప్‌ చేసే మహిళలతో పాటు ఎస్సీ, ఎస్టీలకు కూడా వర్తిస్తుంది. 2023 జనవరి 1 నుంచి ఈ పెంపు వర్తిస్తుందని యూజీసీ పేర్కొంది. పెరిగిన ఈ ఫెల్‌షిప్ మొత్తాలు ప్రస్తుతం యూజీసీ నుంచి ఫెలోషిప్స్ పొందుతున్నవారికి మాత్రమే వర్తించనున్నాయి.