బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 19 మార్చి 2024 (19:50 IST)

రోడ్డుపై కుల్ఫీ ఐస్ క్రీమ్‌ అమ్మాడు.. అందులో వీర్యం కలిపాడు.. చివరికి?

Ice-cream seller
Ice-cream seller
వరంగల్ - నెక్కొండలో రోడ్డుపై ఐస్ క్రీమ్ అమ్ముతున్న వ్యక్తి దానిలో వీర్యం కలుపుతూ అడ్డంగా దొరికిపోయాడు. వివరాల్లోకి వెళితే.. వరంగల్ జిల్లా నెక్కొండ మండల కేంద్రం, అంబేద్కర్ సెంటర్‌లో ఓ కుల్ఫీ ఐస్ క్రీమ్ బండి నడుపుతున్న వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించాడు. వింటేనే ఒళ్లు జలదరించే పని చేశాడు.
 
కస్టమర్లకు ఐస్ క్రీమ్ సప్లె చేసే క్రమంలో చెడు పదార్థం (వీర్యం) కలిపి అడ్డంగా దొరికిపోయాడు. ఇతని చర్యలను గమనించిన స్థానికులు అతనిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. పోలీసులు రంగంలోకి దిగి అతడిని అదుపులోకి తీసుకున్నారు. 
 
కుల్ఫీ ఐస్ అమ్మే వ్యక్తి రాజస్థాన్‌కు చెందిన వాడని తేలింది. ఐస్ క్రీమ్ బండి వద్ద పబ్లిక్‌గా ఈ చర్యకు పాల్పడటంతో పోలీసులు అతనిని అరెస్ట్ చేసి..సెక్షన్ 294 కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు ,సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.