సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 17 మార్చి 2024 (14:31 IST)

నా ప్రభుత్వాన్ని పడగొడతారా? ఈ రోజు నుంచి నా రాజకీయం చూపిస్తా!! : సీఎం రేవంత్ రెడ్డి

ranjith reddy - revanth reddy
భారత రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ హెచ్చరికలు చేశారు. పదే పదే మీ ప్రభుత్వాన్ని పడగొడతాం అంటూ చూస్తూ ఊరుకోవాలా అంటూ ఆయన ఆ రెండు పార్టీలకు వార్నింగ్ ఇచ్చారు. పైగా, ఈ రోజు నుంచి నా రాజకీయం చూపిస్తానంటూ ప్రకటించారు. తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు 100 రోజులు పూర్తయిన సందర్భంగా హైదరాబాద్ నగరంలో నిర్వహించిన మీట్ ది మీడియా కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. 
 
మరోవైపు, భారాసకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఆ పార్టీకి చెందిన చేవెళ్ల ఎంపీ రంజిత్‌ రెడ్డి, ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిపోయారు. సీఎం రేవంత్‌ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్‌ మున్షీ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అంతకుముందు రంజిత్‌ రెడ్డి భారాసకు రాజీనామా చేశారు. ప్రస్తుత రాజకీయ పరిణామాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. 
 
ఈ సందర్భంగా రంజిత్ రెడ్డి మాట్లాడుతూ, ప్రస్తుత రాజకీయ పరిణాల నేపథ్యంలో పార్టీకి రాజీనామా చేసినట్టు ప్రకటించారు. చేవెళ్ల ప్రజలకు ఇంతకాలం సేవ చేసే అవకాశఁ కల్పించినందుకు పార్టీ అధినేత కేసీఆర్, కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. తన రాజీనామాను ఆమోదించాలని ఆయన కేసీఆర్‌ను కోరారు. ఇంతకాలం తనకు సహకరించిన ప్రతి బీఆర్ఎస్ కార్యకర్తకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.