బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 16 మార్చి 2024 (23:02 IST)

బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ తప్ప మరొకటి కాదు.. రేవంతన్న ఫైర్

Revanth Reddy _Sharmila
Revanth Reddy _Sharmila
తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించారు రేవంత్ రెడ్డి. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్, చంద్రబాబుపై నిప్పులు చెరిగారు రేవంత్. వైఎస్ షర్మిల నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం జరగాలంటే కాంగ్రెస్ పార్టీకి మాత్రమే సాధ్యమవుతుందని అన్నారు.
 
బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ తప్ప మరొకటి కాదంటూ రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. వారంతా మోదీతో సంధిలో ఉన్నారని, ఏపీ ప్రజల హక్కుల కోసం మోదీకి వ్యతిరేకంగా పోరాడే దమ్ము ఎవరికీ లేదని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. 
 
మొదటి ఐదేళ్లు చంద్రబాబు సీఎంగా ఉండి, ఆ తర్వాత ఐదేళ్లు జగన్ అధికారంలో ఉన్నా ప్రత్యేక హోదా ఎందుకు రాలేదు? పోలవరం ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేదు? మనకు స్థిరమైన రాజధాని ఎందుకు లేదు? కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఈ అనిశ్చితులు తొలగిపోతాయి.
 
 వైఎస్ఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలనే పట్టుదలతో ఉన్న వైఎస్ షర్మిలకు మద్దతుగా వైజాగ్ వచ్చినట్లు రేవంత్ తెలిపారు.