గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 14 మార్చి 2024 (14:32 IST)

హైదరాబాదులో ఎంబీఏ విద్యార్థిని ఆత్మహత్య.. కారణం?

suicide
హైదరాబాదులో ఎంబీఏ స్టూడెంట్ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఎంబీఐ ముగించి.. ఉన్నత పదవిని అలంకరిస్తుందనుకున్న తమ బిడ్డ బలవన్మరణానికి పాల్పడిందని తెలిసి.. మృతురాలి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. 
 
వివరాల్లోకి వెళితే.. దిల్‌సుఖ్‌న‌గ‌ర్‌లోని ఓ ప్రైవేటు ఉమెన్స్ హాస్ట‌ల్‌లో విద్యార్థిని బ‌ల‌వ‌న్మర‌ణానికి పాల్ప‌డింది.  యువతి మృతిపై అనుమానం వ్యక్తం చేసిన పేరెంట్స్ ఛైతన్యపురి పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.