ఆదివారం, 17 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 13 మార్చి 2024 (19:12 IST)

60 ఏళ్ల వ్యక్తి.. 27 శాతమే కిడ్నీ ఫంక్షన్.. 418 రాళ్ల తొలగింపు

Kidney
హైదరాబాదులో అరుదైన శస్త్రచికిత్స జరిగింది. నగరంలో ఆసియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (AINU)లోని నిపుణులైన యూరాలజిస్ట్‌ల బృందం కేవలం 27 శాతం మూత్రపిండాల పనితీరు ఉన్న రోగి నుండి 418 కిడ్నీ రాళ్లను విజయవంతంగా తొలగించింది. 
 
కిడ్నీలో రాళ్లను తొలగించే శస్త్రచికిత్సా పద్ధతుల్లో గణనీయమైన పురోగతిని చెందిన మినిమల్లీ ఇన్వాసివ్ ప్రక్రియ ద్వారా ఈ విశేషమైన ఫీట్ సాధించబడిందని వైద్యులు తెలిపారు. 60 ఏళ్ల వ్యక్తి  మూత్రపిండాల్లో రాళ్ల ద్వారా వాటి పనితీరు తీవ్రంగా బలహీనపడింది. 
 
రెండు గంటలపాటు శస్త్రచికిత్సా బృందం ప్రతి రాయిని పూర్తిగా తొలగించింది. ఈ శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసిన వైద్యులను ప్రశంసలు కురిపిస్తున్నారు.