శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 13 మార్చి 2024 (14:16 IST)

రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ ల కొత్త సినిమా తాజా అప్డేట్

amitab-rajani at shooting spot
amitab-rajani at shooting spot
బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్, కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ కలిసి నటిస్తున్న చిత్రం షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. జైలర్ సినిమా విజయం తర్వాత రజనీకాంత్ కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టారు. తమిళంలో రూపొందుతున్న ఈ సినిమాకు కె.జి. జ్నానవేల్ రాజా దర్శకత్వం వహించడం విశేషం. పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగుతోంది.
 
రెండు రోజులుగా హైదరాబాద్ లోని నాగోల్ మెట్రో స్టేషన్ లో రజనీకాంత్, అమితాబ్ తోపాటు పలువురు ఫైటర్లు పాల్గొన్న సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. యాక్షన్ సీన్ అనంతరం రజనీకాంత్ చాలా కూల్ గా తన కార్ వేన్ లో ఆర్బాటం లేకుండా వస్తుండగా అభిమానులు సెల్ పోన్లలో ఆయన్ను బంధించారు. ఈ సందర్భంగా అమితాబ్ పూలపూల చొక్కా వేసుకుని కనిపించారు. ఆయన రాకను చూసిన అభిమానులు కొందరు పుష్పగుచ్చాలు ఇవ్వడంతో నివారించకుండా ఆయన స్వీకరించడం విశేషం. ఇక త్వరలో ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు తెలియనున్నాయి.