సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 13 మార్చి 2024 (13:03 IST)

నాటి సి.ఎస్.ఆర్. నేటి రాజీవ్ కు సంబంధం ఏమిటో తెలుసా !

CSR- Rajiv
CSR- Rajiv
సినిమా రంగంలో అలనాటి నటీనటుల వారసులు పెద్దగా కనిపించరు. నాగేశ్వరరావు, రామారావు వంటి ప్రముఖుల వారసులు తెలుసుకానీ, ఎస్.వి.రంగారావు, సి.ఎస్.ఆర్. వంటి కొందరి వారసులు  సినిమా రంగానికి దూరంగా వున్నారని మాత్రమే తెలుసు. కొందరు చాలా దగ్గరగా వున్నారు. కానీ వారు పెద్దగా చెప్పుకోరు. సందర్భంగా రావాలి. అలాంటి సందర్భంగా రాజీవ్ చిలక అనే నిర్మాతకు వచ్చింది.
 
రాజీవ్ చిలక యానిమేషన్ నిర్మాణంలో వున్నారు. తొలిసారిగా ఛోటాభీమ్ అనే యానిమేషన్ సినిమాను చేశారు. ఆతర్వాత పలు సినిమాలకు వెనుకవుండి నడిపించారు. అలాంటి రాజీవ్ చిలక నేడు నిర్మాతగా అల్లరి నరేశ్ తో ఆ ఒక్కటి అడక్కు సినిమా చేశారు. ఈ సందర్భంగా ఓ ప్రశ్నకు సమాధానం చెబుతూ.. సి.ఎస్.ఆర్. గారి మనవడిని అంటూ రహస్యాన్ని తెలియజేశారు.
 
చిలకలపూడి సీతా రామ ఆంజనేయులు C. S. R. గా ప్రసిద్ది చెందారు,  అనేక రంగస్థల నాటకాలలో నటించారు.175 చిత్రాలలో ప్రధాన పాత్రలు మరియు పౌరాణిక పాత్రలను పోషించారు. ముఖ్యంగా శకుని పాత్రలో ఆయన జీవించారనే చెప్పాలి. అలాంటి ఆయన వారసులు ఎవరూ సినిమారంగంలోకి నటుడిగా రాలేకపోయారు. కానీ ఆయన మనవడు రాజీవ్ నిర్మాతగా మారారు.
 
ఆయన మాట్లాడుతూ, చిలకలపూడి ఇంటిపేరును చిలకగా ఎందుకు మార్చారనేందుకు సమాధానమిస్తూ.. సెంటిమెంట్ గా వర్కవుట్ కాలేదు. అందుకే చిలక అని నా పేరు ముందు పెట్టుకున్నాను. నా ప్రొడక్షన్ హౌస్ కూ చిలక అని పేరు పెట్టాను. నాకు పెల్లయ్యాక బాగా కలిసి వచ్చింది అంటూ తెలియజేయడం విశేషం. త్వరలో మరిన్ని సినిమాలు నిర్మిస్తాననీ, యానిమేషన్ రంగంలో కూడా పలు సినిమాలు చేస్తానని వెల్లడించారు.