గురువారం, 13 మార్చి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 13 మార్చి 2025 (10:48 IST)

తండ్రిని చూడ్డానికి వచ్చి కన్నబిడ్డల్ని వదిలేసిన వెళ్లిపోయిన కసాయి తల్లి.. ఎక్కడ? (video)

Kids
Kids
కన్నబిడ్డలను కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతల్లి ఆ పిల్లల పట్ల కసాయి తల్లిగా మారింది. తెలంగాణలో ఓ తల్లి తన ఇద్దరు కుమారులను ప్రభుత్వ ఆస్పత్రిలోనే వదిలేసి వెళ్లిపోయింది. వివరాల్లోకి వెళితే.. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మడలం సాతరం గ్రామానికి చెందిన నరేష్‌తో దివ్యకు వివాహం కాగా రోడ్డు ప్రమాదంలో నరేష్ మృతి చెందాడు. దీంతో దివ్య వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. 
 
ఈ నేపథ్యంలో తన ఇద్దరు పిల్లలను ప్రభుత్వ ఆస్పత్రిలోనే దివ్య వదిలేసి వెళ్లింది. అనారోగ్యంతో  ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన తండ్రిని చూసేందుకు వెళ్లిన దివ్య అక్కడే పిల్లలను వదిలేసి వెళ్లిపోయింది. అంతేగాకుండా తండ్రితో గొడవపడి ఇద్దరు పిల్లను అక్కడే వదిలేసి జంప్ అయ్యింది. దీంతో ఆ పిల్లలు అమ్మమ్మ తాత వద్దనే వుంటున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.