ఆదివారం, 9 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 8 ఫిబ్రవరి 2025 (21:53 IST)

చిరుధాన్యాల పునరుద్ధరణ, పత్తి పునరుద్ధరణ: ఢిల్లీ కళా ప్రదర్శనలో తెలుగు రాష్ట్రాల నుండి సస్టైనబిలిటీ ఛాంపియన్లు

saraswati and satish
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుండి ఇద్దరు సస్టైనబిలిటీ ఛాంపియన్లు సమిష్టి వాతావరణ చర్యను ప్రేరేపించడానికి సైన్స్, కళను కలిసే మొట్టమొదటి వేదిక అయిన సస్టైనా ఇండియా 2025లో ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఇండియా ఆర్ట్ ఫెయిర్ సందర్భంగా ఫిబ్రవరి 2-16 వరకు న్యూఢిల్లీలోని STIR ఆర్ట్ గ్యాలరీలో జరుగుతున్న ఈ ప్రదర్శనను ‘విత్ ఈచ్ సీడ్ వి సింగ్’ అనే పేరుతో నిర్వహిస్తున్నారు. విజయనగరానికి చెందిన చిరు ధాన్యాల రైతు, మహిళా సాధికారత నాయకురాలు సరస్వతి మల్లువలస, హైదరాబాద్ నుండి డిజైనర్- పత్తి సస్టైనబిలిటీ ప్రచారకుడు పోలుదాస్ నాగేంద్ర సతీష్ పాల్గొంటున్నారు. సంప్రదాయం, ఆవిష్కరణలలో లోతుగా పాతుకుపోయిన వారి పని, ఆంధ్ర- తెలంగాణ లు పర్యావరణ అనుకూల వ్యవసాయం, వస్త్రాలలో ఎలా ముందుండగలదో ప్రదర్శిస్తుంది.
 
థింక్ ట్యాంక్ కౌన్సిల్ ఆన్ ఎనర్జీ, ఎన్విరాన్‌మెంట్ అండ్ వాటర్, ప్రముఖ కళాకారుల జంట తుక్రాల్ & టాగ్రా మరియు క్యూరేటర్ శ్రీనివాస్ ఆదిత్య మోపిదేవిల భాగస్వామ్యంతో రూపొందిన సస్టైనా ఇండియా రెండవ ఎడిషన్, కమ్యూనిటీ నేతృత్వంలోని వాతావరణ చర్యపై దృష్టి పెడుతుంది. ఈ ప్రతిష్టాత్మక వేదికలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుండి ఇద్దరు సభ్యులను చేర్చడం ఈ ప్రాంతం యొక్క పర్యావరణ అనుకూల పద్ధతుల యొక్క గొప్ప వారసత్వానికి, దాని ప్రజల పరివర్తన ప్రయత్నాలకు నిదర్శనం. ఈ ప్రదర్శనలో మెటీరియల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకురాలు ఫెలో శుభి సచన్ ప్రదర్శనలు, చందర్ హాత్, ఎడిబుల్ ఇష్యుస్, శేషదేవ్ సాగ్రియా వంటి ఆహ్వానించబడిన కళాకారుల కళాకృతులు, ఇన్స్టాలేషన్లు కూడా ఉన్నాయి.
 
చిరుధాన్యాలను పునరుద్ధరించడం: ఆరోగ్య మిల్లెట్ సిస్టర్స్ కథ
సబల (సొసైటీ ఫర్ అవేర్‌నెస్ అండ్ బెటర్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చరల్ లైవ్లిహుడ్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్) కార్యదర్శి మరియు ఆరోగ్య మిల్లెట్ సిస్టర్స్ నెట్‌వర్క్ వ్యవస్థాపకురాలు సరస్వతి మల్లువలస. మిల్లెట్ సాగును పునరుద్ధరించడానికి, మహిళా రైతులకు సాధికారత కల్పించడానికి రెండు దశాబ్దాలకు పైగా తన జీవితాన్ని ఆమె అంకితం చేశారు. ఒకప్పుడు విస్మరించబడిన చిరుధాన్యాలు ఇప్పుడు పోషకాలు అధికంగా ఉండే, వాతావరణానికి అనుగుణంగా ఉండే పంటగా గుర్తింపు పొందుతున్నాయి, ఇది చిన్న రైతులకు మద్దతు ఇస్తుంది. ఆమె నాయకత్వంలో, సబల 50 గ్రామాల్లోని 1,500 ఎకరాల్లో మిల్లెట్ సాగును పునరుజ్జీవింపజేసింది, ప్రజా పంపిణీ వ్యవస్థలలో దీనిని చేర్చాలని కోరుతుంది. 3,000 మంది రైతులతో కూడిన వారి నెట్‌వర్క్‌లో విభిన్న ప్రాతినిధ్యం ఉంది, 50 శాతం గిరిజన వర్గాల నుండి, 20 శాతం దళిత వర్గాల నుండి ఈ నెట్‌వర్క్‌లో భాగంగా వున్నారు. సరస్వతి ప్రయత్నాల కారణంగా ఆమెకు CII ఫౌండేషన్ నుండి ఉమెన్ ఎగ్జాంప్లర్ అవార్డుతో సహా బహుళ అవార్డులు లభించాయి.
 
సస్టైనా ఇండియా 2025లో, సరస్వతి ఇన్‌స్టాలేషన్, విజయనగరం నుండి వచ్చిన దేశీయంగా పండించిన మిల్లెట్‌లు, జానపద పాటలు, ఇంటరాక్టివ్ అంశాల ద్వారా ఆరోగ్య మిల్లెట్ సిస్టర్స్ కథకు జీవం పోసింది, ఈ ధాన్యాల సాంస్కృతిక, పర్యావరణ ప్రాముఖ్యతను ప్రదర్శిస్తుంది. “సంవత్సరాలుగా, మిల్లెట్‌లను పాతవిగా తోసిపుచ్చారు, మహిళలను రైతులుగా చూడలేదు. నేడు, మేము సస్టైనా ఇండియాలో జాతీయ వేదికపై నిలబడి, ఈ పురాతన ధాన్యాలు పర్యావరణ అనుకూల వ్యవసాయం యొక్క భవిష్యత్తు అని నిరూపిస్తున్నాము. చిన్న ధాన్యాలు కరువులను తట్టుకోగలవు, నేలను సుసంపన్నం చేయగలవు. బియ్యం, గోధుమలతో పోలిస్తే మెరుగైన పోషకాహారాన్ని అందించగలవు, ఇవన్నీ చిన్న రైతులకు జీవనోపాధిని కల్పిస్తూనే ఉన్నాయి. వాతావరణ మార్పు వర్షపాతాన్ని ఊహాతీతంగా మారుస్తుంది. ఆహార భద్రతను మరింత అత్యవసరంగా మారుస్తుంది కాబట్టి, మా పని సంప్రదాయం గురించి మాత్రమే కాదు; ఇది మనుగడ గురించి. స్థానిక జ్ఞానం, సమిష్టి చర్య వాతావరణ స్థిరత్వంను నడిపిస్తాయని చూపించే మా సమాజానికి ఇది గర్వకారణమైన క్షణం” అని సరస్వతి మల్లువలస అన్నారు.
 
పత్తి పర్యావరణ వ్యవస్థను తిరిగి పునరుధ్దరించటం : హైదరాబాద్ డిజైనర్ దృష్టి
హైదరాబాద్‌లోని కోరా డిజైన్ కొలాబరేటివ్ వ్యవస్థాపకుడు పోలుదాస్ నాగేంద్ర సతీష్, స్వదేశీ పత్తి- సాంప్రదాయ చేతి-నేత పద్ధతులను పునరుద్ధరించడానికి కృషి చేస్తున్నారు. అహ్మదాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్‌లో గ్రాడ్యుయేట్ అయిన సతీష్, పర్యావరణ, సమాజ సవాళ్లను పరిష్కరించడానికి సాంప్రదాయ పనితనంను పర్యావరణ రూపకల్పనతో మిళితం చేసారు. 1980లలో 1,000 కంటే ఎక్కువ సేంద్రీయ పత్తి రకాల్లో, నేడు 12 మాత్రమే మిగిలి ఉన్నాయని ఆయన పరిశోధన వెల్లడించింది. ఆయన పని వస్త్ర పరిశ్రమలో పర్యావరణ సమతుల్యతను పునరుద్ధరించడం, రైతు-కళాకారుల సంబంధాలను బలోపేతం చేయడంపై దృష్టి పెడుతుంది.
 
ఉదాహరణకు, 40 సంవత్సరాలలో CEEW యొక్క తహసీల్ స్థాయి వర్షపాత నమూనాలపై అధ్యయనం ప్రకారం, గత 30 సంవత్సరాలతో పోలిస్తే, వాతావరణ మార్పుల ప్రభావం వేగంగా పెరగడం వల్ల ఆంధ్రప్రదేశ్‌లో గత దశాబ్దంలో సంవత్సరానికి భారీ వర్షపాతం రోజులు పెరిగాయి. సస్టైనా ఇండియా 2025లో, సతీష్ యొక్క మల్టీపార్ట్ ఇన్‌స్టాలేషన్ సాంప్రదాయ పత్తి నాణ్యత కోల్పోవడం, దానిని పునరుద్ధరించడానికి చేసిన ప్రయత్నాలపై ఒక ఆకర్షణీయమైన కథనాన్ని అందిస్తుంది. సేంద్రీయ నేత, సాధనాలు మరియు డాక్యుమెంటేషన్ ద్వారా వాతావరణ సవాళ్లను ఎదుర్కొంటూ పర్యావరణ అనుకూల  పత్తి వ్యవసాయం యొక్క ప్రాముఖ్యతను ఆయన వెల్లడించారు.
 
“తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లు లోతుగా పాతుకుపోయిన వస్త్ర వారసత్వాన్ని కలిగి ఉన్నాయి, కానీ పారిశ్రామికీకరణ, వాతావరణ మార్పు మన దేశీయ పత్తి రకాలు, చేనేత సంప్రదాయాలను అస్పష్టత వైపు నెట్టాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, క్రమరహిత వర్షపాతం, నేల క్షీణత పత్తి రైతులు తమ జీవనోపాధిని నిలబెట్టుకోవడం కష్టతరం చేస్తున్నాయి. ఈ ప్రదర్శన ద్వారా, మేము కేవలం ఒక కథ చెప్పడం లేదు- మేము ఒక వారసత్వాన్ని పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తున్నాము. రైతులు, చేతివృత్తులవారు, వినియోగదారులను తిరిగి అనుసంధానించటం ద్వారా, మన సాంస్కృతిక వారసత్వం, వాతావరణ-సురక్షిత భవిష్యత్తు రెండింటికీ మద్దతు ఇచ్చే స్థిరమైన  పత్తి పర్యావరణ వ్యవస్థను పునర్నిర్మించగలము” అని పోలుదాస్ నాగేంద్ర సతీష్ అన్నారు.
 
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ నుండి వాతావరణ వంటకాలు
సస్టైనా ఇండియా 2025లో క్లైమేట్ రెసిపీస్ II: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎడిషన్ కూడా ఉంది, ఇది ఈ ప్రాంతంలోని సహజ వ్యవసాయం, వ్యవసాయ పర్యావరణ శాస్త్రం, ఆహార వ్యవస్థలపై దృష్టి సారించే ప్రాజెక్ట్. శ్రీనివాస్ మంగిపూడి, శ్రీనివాస్ ఆదిత్య మోపిదేవి, దియా షా నేతృత్వంలో, ఇది సహజ వ్యవసాయం, వ్యవసాయ పర్యావరణ శాస్త్రం, భూమి హక్కులను వాతావరణ స్థిరత్వంకు స్తంభాలుగా అన్వేషిస్తుంది. ఈ కొనసాగుతున్న పరిశోధన ప్రాజెక్ట్ డ్రాయింగ్‌లు, ప్రచురణల ద్వారా పర్యావరణ అనుకూల ఆహార వ్యవస్థలపై తరతరాలుగా వచ్చిన జ్ఞానాన్ని నమోదు చేస్తుంది. ఈ ప్రదర్శన డ్రాయింగ్‌లు, ఆర్కైవల్ మెటీరియల్, పరిశోధన ఫలితాలను ప్రదర్శిస్తుంది, ఇది ఈ ప్రాంతం యొక్క వాతావరణ నాయకత్వ కథకు మరో పొరను జోడిస్తుంది.