ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 27 మార్చి 2024 (16:19 IST)

హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా సానియా మీర్జా పేరు ఖరారు?!!

sania mirza
ప్రముఖ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్ధంగా వున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా పేరు దాదాపు ఖరారైనట్లుగా తెలుస్తోంది. ఆమె పేరును అజారుద్ధీన్ ప్రతిపాదన చేశారు. 
 
సానియా స్టార్ ఇమేజ్ కూడా కలిసి వస్తుందని హస్తం నేతలు భావిస్తున్నారు. ఎంఐఎంనేత అసదుద్దీన్‌‌పై సానియా లాంటి స్టార్స్ పోటీ చేస్తే గెలుపు తథ్యమని కాంగ్రెస్ నేతలు అనుకుంటున్నారు. మజ్లిస్ కంచుకోట అయిన హైదరాబాద్ పార్లమెంట్ స్థానాన్ని ఈసారి బీజేపీ, కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకోనున్నాయి. 
 
ఇకపోతే.. తెలంగాణ కాంగ్రెస్ తరఫున పోటీ చేసే ఎంపీ అభ్యర్థుల జాబితా దాదాపు ఖరారైనట్లుగా వార్తలు వస్తున్నాయి. బుధవారం ఢిల్లీలో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం కానుంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాపై ఈ సమావేశంలో కసరత్తు చేస్తారు.