సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 15 ఫిబ్రవరి 2024 (12:24 IST)

నేను నిన్ను ప్రేమించట్లేదు.. షోయబ్‌కు సానియా మీర్జా ఇచ్చిన రిప్లై ఏంటి?

sania couple
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తన మాజీ భర్త, పాకిస్థానీ క్రికెటర్ షోయబ్ మాలిక్ నటి సనా జావేద్‌ను మూడోసారి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. షోయబ్ మూడో పెళ్లికి తర్వాత  సానియా కుటుంబం కూడా అధికారిక ప్రకటనలో సానియాతో షోయబ్ విడాకులను ధృవీకరించింది. అప్పటి నుండి, సానియా, షోయబ్‌ల పాత వీడియోలు, చిత్రాలు ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో సానియా మీర్జా షేర్ చేసిన డిసెంబర్ 2021 ఇన్‌స్టాగ్రామ్ రీల్ కూడా నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది.
 
 ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో నేను నిన్ను ప్రేమించడం లేదు.. అని షోయబ్ అంటాడు. అందుకు సానియా ధీటుగా బదులిస్తుంది. నీకే నష్టం.. నాకు పోయేదేం లేదు.. అన్నట్లు అర్థం వచ్చేలా బాలీవుడ్ హిట్ సాంగ్ "ఇస్మే తేరా ఘాటా మేరా కుఛ్ నహీ జాతా" అంటూ పాడుతుంది. ఇది వాళ్లిద్దరి కాపురం సజావుగా సాగుతున్న సమయంలో చేసిన వీడియో అని అర్థమవుతూనే ఉంది. ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. 

Sania Mirza
Sania Mirza
 
సానియా ఇన్‌స్టాగ్రామ్ నుండి వీడియో తొలగించబడినప్పటికీ, అది మళ్లీ తెరపైకి వచ్చింది. ఇది అభిమానుల మధ్య చర్చలకు దారితీసింది. సానియా మీర్జా- షోయబ్ మాలిక్ 2010లో వివాహం చేసుకున్నారు. 2018లో ఈ దంపతులకు ఇజాన్ మీర్జా మాలిక్‌ పుట్టాడు. అయితే, ఈ జంట 2023లో విడిపోవాలని నిర్ణయించుకున్నారు. సానియాకు విడాకులిచ్చి.. మాలిక్ మూడో వివాహం చేసుకున్నాడు.