బుధవారం, 22 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 29 జనవరి 2024 (12:57 IST)

షోయబ్ మాలిక్ భార్యను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు

Sana Javed
Sana Javed
పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్, నటుడు సనా జావేద్‌తో వివాహం.. భారత టెన్నిస్ ఏస్ సానియా మీర్జాతో విడాకుల వ్యవహారం నెట్టింట వైరల్ అవుతోంది. షోయబ్ మాలిక్, నటుడు సనా జావేద్‌ వివాహం గురించిన వార్తలు దాయాది దేశాల్లో కలకలం రేపుతున్నాయి. 
 
షోయబ్ మాలిక్ తన కొత్త భార్యతో ఉన్న చిత్రాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా, సానియా మీర్జా కుటుంబం నుండి విడాకుల వార్తలు వచ్చాయి. 
 
సనా శనివారం తన వివాహం తర్వాత సోషల్ మీడియాలో తన మొదటి సోలో చిత్రాన్ని పోస్ట్ చేసింది. ఈ ఫోటోను చూసిన వారంతా ఇన్‌స్టాగ్రామ్ యూజర్లను ఆమెను భారీగా ట్రోల్ చేశారు. ఈ ట్రోల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.