శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 9 ఆగస్టు 2024 (18:47 IST)

అవినీతి అనకొండ.. ఏపీబీ తనిఖీల్లో రూ.2.93 కోట్ల నగదు స్వాధీనం (Video)

Cash
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్‌ మున్సిపల్‌ సూపరింటెండెంట్‌ నివాసంపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు శుక్రవారం సోదాలు చేశారు. ఈ తనిఖీల్లో కోట్లాది రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. నిజామాబాద్ మున్సిపల్‌ సూపరింటెండెంట్‌ (ఇన్‌చార్జ్ రెవెన్యూ ఆఫీసర్)గా దాసరి నరేందర్‌ విధులు నిర్వహిస్తున్నారు. ఈయనపై నమోదైన కేసులో భాగంగా ఆయన నివాసంపై ఏసీబీ దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో భారీగా నగదు, ఆదాయానికి మించిన ఆస్తులు వెలుగు చూశాయి. 
 
ఇంట్లో రూ.2.93 కోట్ల నగదును, రూ.1.10 కోట్లు బ్యాంకు బ్యాలెన్స్‌ను నరేందర్, అతని భార్య, అతని తల్లి ఖాతాల్లో ఉన్నాయి. అదనంగా 51 తులాల బంగారం, 17 స్థిరాస్తుల విలువ రూ.1.98 కోట్లు అతని ఇంట్లో గుర్తించిన ఏసీబీ అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్న మొత్తం ఆస్తుల విలువ దాదాపు రూ.6.07 కోట్లుగా గుర్తించారు.