గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 30 ఏప్రియల్ 2024 (13:35 IST)

తెలంగాణ 10వ తరగతి పరీక్ష ఫలితాలు.. బాలికలదే పైచేయి

తెలంగాణ 10వ తరగతి పరీక్ష ఫలితాలు బషీర్‌బాగ్‌లోని ఎస్సీఈఆర్టీ కార్యాలయంలో అధికారికంగా విడుదలయ్యాయి. పదో తరగతి ఫలితాల్లో 91.31 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం ప్రకటించారు. డేటా ప్రకారం, 93.23 శాతం బాలికలు, 89.42 శాతం బాలురు పరీక్షలలో ఉత్తీర్ణులయ్యారు.
 
మొత్తం 5,05,813 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా, 4,91,862 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఈ ఏడాది మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు పరీక్షలు నిర్వహించగా 5,08,385 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.

వారిలో బాలురు 2,57,952 మంది, బాలికలు 2,50,433 మంది ఉన్నారు. 3,927 పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణత సాధించగా, ఆరు పాఠశాలలు సున్నా శాతం ఉత్తీర్ణత సాధించడం గమనార్హం.