శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 8 మార్చి 2024 (12:27 IST)

పీకల్లోతు అప్పులు, ఇంటికి దెయ్యం పట్టిందని నిమ్మకాయ కోసి 10 తులాల బంగారంతో పరార్

gold
అప్పులు ఎవరికి వుండవు. ఏ మనిషిని కదిలించినా తనకు పుట్టెడు అప్పులు వున్నాయని చెపుతారు. ఐతే కొందరు చేసిన అప్పులు ఎందుకు అయ్యాయా అనే విషయాన్ని పక్కన పడేసి, మూఢ విశ్వాసాలను ఆశ్రయిస్తుంటారు. ఇలాంటి ఘటనే హైదరాబాద్ నగరంలోని ఫిలిమ్ నగరంలో చోటుచేసుకున్నది. ఇంట్లో అశాంతి, అప్పులు తదితర సమస్యలున్నాయని ఓ మహిళ చెప్పింది.
 
ఈ మాటలను విన్న మాయగాళ్లు ఆమె ఇంటికి వచ్చేసారు. ఇంటికి దెయ్యం పట్టిందనీ, అందువల్లనే ఇంట్లో అశాంతి, అప్పులు ప్రారంభమయ్యాయనీ, పూజ చేస్తే వదిలిపోతుందని నమ్మించారు. పూజలో బంగారు వస్తువులు వుంచాలని చెప్పడంతో ఆమె 10 తులాల బంగారాన్ని పెట్టేసింది. దాంతో సదరు దుండగులు మహిళను కళ్లు మూసుకుని ప్రార్థన చేస్తుండాలని చెప్పారు. ఆమె కళ్లు మూసుకుని ప్రార్థిస్తుండగా బంగారాన్ని తీసుకుని అక్కడి నుంచి పరారయ్యారు. దీనితో తను మోసపోయానని తెలుసుకుని పోలీసులను ఆశ్రయించింది మహిళ. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.