శనివారం, 26 ఏప్రియల్ 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 26 ఏప్రియల్ 2025 (12:59 IST)

మరో మహిళతో భర్త అక్రమ సంబంధం.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య (video)

Techie
Techie
అక్రమ సంబంధాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. వివాహేతర సంబంధాల కారణంగా నేరాలు సైతం పెరిగిపోతున్నాయి. తాజాగా హైదరాబాద్‌లో మరో మహిళతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అక్రమ సంబంధం బట్టబయలు అయ్యింది. 
 
మహిళతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అక్రమ సంబంధం నెరపాడు. దీంతో అతడి భార్య రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌కి చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి శివకు నాలుగేళ్ల క్రితం దీప్తి అనే మహిళతో వివాహం అయ్యింది. వీరికి మూడేళ్ల పాప వుంది. 
 
అయితే సుష్మ అనే మహిళతో శివ సహజీవనం చేస్తున్నాడని తెలుసుకున్న దీప్తి.. అతనిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఇంకా సుష్మతో కూకట్‌పల్లిలో నివాసం ఉంటున్నాడని తెలుసుకుని, బంధువులతో కలిసి వెళ్లి శివను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.