సీఎం కేసీఆర్ నాయకత్వంలో వ్యవసాయం పండుగలా మారింది: మంత్రి జగదీష్ రెడ్డి
తెలంగాణలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో వ్యవసాయం పండుగలా మారిందని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. రైతన్నలు కాలంతో పోటీ పడుతూ పసిడి సిరులు పండిస్తున్నారన్నారు. సూర్యపేట నియోజకవర్గంలోని గాజుల మల్కాపురం గ్రామంలో రైతులతో కలిసి ఏరువాక కార్యక్రమాన్ని జగదీష్ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. నకిలీ విత్తనాల బెడద లేకుండా, ముందస్తుగానే ఎరువులను, విత్తనాలను అందుబాటిలో ఉంచడంతో రైతన్నలు చాలా సంతోషంగా ఎరువాకను ప్రారంభించారని చెప్పారు. మూస పద్ధతులకు స్వస్థి పలికి లాభాలు వచ్చే పంటలను మాత్రమే సాగు చేయాలని మంత్రి సూచించారు. ఇక ఈ వానాకాలం సీజన్ లో కూడా కాళేశ్వరంతో గోదావరి జలాలు సూర్యపేట జిల్లాకు అందిస్తున్నామని, అన్ని చెరువులను నిపుతున్నామని మంత్రి జగదీష్ రెడ్డి చెప్పారు.