మంగళవారం, 19 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By Selvi
Last Updated : సోమవారం, 27 మార్చి 2017 (17:10 IST)

అర్థరాత్రి వివాహితకు ఫోన్‌లో వేధింపులు.. భర్త డౌట్.. షీ టీమ్స్ సాయంతో?

టెక్నాలజీ పెరిగే కొద్దీ జరిగే మేలేంటోననే విషయాన్ని పక్కనబెడితే.. స్మార్ట్ ఫోన్ల పుణ్యంతో మహిళలపై వేధింపులు పెచ్చరిల్లిపోతున్నాయి. హైదరాబాదుకు చెందిన ఓ యువతి సెల్ ఫోన్‌ ద్వారా వేధించిన వ్యక్తిపై షీ టీమ

టెక్నాలజీ పెరిగే కొద్దీ జరిగే మేలేంటోననే విషయాన్ని పక్కనబెడితే.. స్మార్ట్ ఫోన్ల పుణ్యంతో మహిళలపై వేధింపులు పెచ్చరిల్లిపోతున్నాయి. హైదరాబాదుకు చెందిన ఓ యువతి సెల్ ఫోన్‌ ద్వారా వేధించిన వ్యక్తిపై షీ టీమ్స్‌కు ఫిర్యాదు చేసింది. షీ టీమ్‌కు బాధితురాలు ఫిర్యాదు చేయడంతో ఫోన్ నెంబర్ ఆధారంగా అతడిని షీ టీమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లాకు చెందిన బాబాజాన్ అనే వ్యక్తి ఫోన్ చేసి మహిళలను వేధించడమే పనిగా పెట్టుకున్నాడు.
 
ఈ క్రమంలో హైదరాబాదుకు చెందిన బాధితురాలు అతడికి ఫోనులో చిక్కింది. ఫోనులో వేధింపులు, అసభ్య పదజాలంతో నిత్యం వేధించడంతో అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అరెస్టుకు అనంతరం అతని వద్ద పోలీసులు జరిపిన దర్యాప్తులో సదరు వ్యక్తి చిత్తూరు జిల్లాకు చెందిన వాడని తేలింది. ఇతడి పేరు బాబాజాన్ అని, కార్పెంటర్‌గా పనిచేస్తున్నాడని, మహిళలను ఫోను వేధించేవాడని తెలిసింది
 
ఈ క్రమంలోనే హైదరాబాదుకు చెందిన బాధితురాలికి అర్థరాత్రి పూట ఫోన్ చేసేవాడు. దీంతో బాధితురాలి భర్త ఆమెపై అనుమానం వ్యక్తం చేశాడు. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు కూడా వచ్చాయి. దీంతో బాధితురాలు షీటీమ్స్‌ను ఆశ్రయించింది.