ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By
Last Modified: శనివారం, 12 జనవరి 2019 (21:04 IST)

నువ్వు ఇంతకీ ఆడా? మగా? పోలీసు ప్రశ్న... ఏం సమాధానం వచ్చిందో తెలుసా?

ఈమధ్య హైదరాబాదులో కార్లను అద్దెకు తీసుకోవడం... ఆ కార్లతో సహా మాయమవుతున్నవారితో కార్లను అద్దెకిచ్చేవారు లబోదిబోమంటున్నారు. ఐతే అద్దెకు తీసుకున్న కార్లను లేపేయడంలో నైపుణ్యం సంపాదించిన సదరు కారు దొంగలను అత్యంత చాకచక్యంగా పోలీసులు పట్టేశారు. ఆ తర్వాత వారిని స్టేషనుకి తీసుకువచ్చి వారి వివరాలను నమోదు చేయడం మొదలుపెట్టారు. 
 
ఐతే ఇద్దరిలో ఒకరిని చూసి వాళ్లకు ఏదో తేడాగా అనిపించింది. దాంతో ఇద్దరిలో తేడాగా అనిపించిన వ్యక్తితో నువ్వు ఇంతకీ ఆడా? మగా? అంటూ పోలీసు ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు అతడి నుంచి నేను మగవాడ్ని కాదు మహిళను అని చెప్పడంతో షాకయ్యారు.

ఐతే పుట్టినప్పుడు తను అమ్మాయినేననీ, కానీ తనలో మగవాళ్ల లక్షణాలు వుండటంతో ముంబై వెళ్లి మగాడిలా మారేందుకు చికిత్స చేయించుకున్నట్లు తెలిపాడు సదరు ఆడమగ దొంగ. దీనితో పోలీసులు లింగ నిర్థారణ కోసం వైద్యులను సంప్రదించారు. వీరిద్దరూ హైదరాబాదులోని కుషాయిగూడ పరిధిలో కార్లను అద్దెకు తీసుకుంటూ వాటిని తీసుకెళ్లి ఏ పార్టుకి ఆ పార్టు విడదీసి అమ్మేస్తున్నారు.