శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : గురువారం, 13 మే 2021 (13:44 IST)

తల బిందెలో ఇరుక్కుపోయింది.. కట్టర్‌తో కట్ చేసి..?

చిన్న పిల్లలు ఎప్పుడు అల్లరి చేస్తూనే ఉంటారు. కొందరైతే తల్లిదండ్రుల కళ్లుకప్పి రోడ్లపైకి పరుగులు తీస్తారు. వీరు చేసే పనుల్లో కొన్ని ఆనందం తెప్పిస్తే మరికొన్ని చిరాకు తెప్పిస్తాయి. 
 
ఒక్కోసారి కొందరు పిల్లలు తెలిసీతెలియక ప్రమాదాల బారినపడుతుంటారు. తాజాగా నాలుగేళ్ళ బాలుడు బిందెలో తల పెట్టాడు. తల బిందెలో ఇరుక్కుపోవడంతో దానిని తీసేందుకు తల్లిదండ్రులు తీవ్రంగా ప్రయత్నించారు.
 
ఎంతకు రాకపోవడంతో గ్రామంలోని వడ్రంగి ఇంటికి వెళ్లి కట్టర్‌తో బిందెను కట్ చేసి తలను బయటకు తీశారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా కేశవపట్నం గ్రామంలో చోటుచేసుకుంది. బాలుడికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో తల్లిదండ్రులు ఊపిరిపీల్చుకున్నారు.