సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By pnr
Last Updated : మంగళవారం, 17 అక్టోబరు 2017 (10:39 IST)

హైదరాబాద్‌లో ఓఆర్ఆర్‌లో విషాదం.. ఫ్యామిలీ సూసైడ్...

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్)లో విషాదం నెలకొంది. ఓఆర్ఆర్, కొల్లూరు వద్ద ఐదు మృతదేహాలను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించగా మొత్తం ఐదు మృ

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్)లో విషాదం నెలకొంది. సంగారెడ్డి జిల్లా ఓఆర్ఆర్, కొల్లూరు సమీపంలోని ఇంద్రారెడ్డి నగర్ వద్ద ఐదు మృతదేహాలను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించగా మొత్తం ఐదు మృతదేహాలు ఉన్నట్టు నిర్ధారించారు. ఇందులో ఇద్దరు పురుషులు, ఒక మహిళ, ఇద్దరు యువతులు ఉన్నారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా భావిస్తున్నారు. 
 
అంటే ఒకే కుటుంబానికి ఈ సభ్యులంతా ఆత్మహత్యకు పాల్పడివుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో మృతదేహాలను స్వాధీనం చేసుకుని పంచనామా నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అలాగే, ఈ మృతదేహాలకు సంబంధించిన వివరాలు, ఇతర కుటుంబ సభ్యుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్న వివరాలు తెలియాల్సి ఉంది.