సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 24 జూన్ 2023 (12:56 IST)

తెలంగాణలో నాలుగో శనివారం నో బ్యాగ్‌ డే

Students
స్కూల్‌ బ్యాగ్‌ పాలసీ 2020 ప్రకారం ఏడాదిలో 10 రోజులు బ్యాగ్‌ లేకుండా విద్యార్థులు బడికొచ్చేలా చూడాలని తెలంగాణ విద్యాశాఖ సూచించింది. ఈ అకాడమిక్ ఇయర్ నుంచి ప్రతినెలలో నాలుగో శనివారం నో బ్యాగ్‌డేగా అమలు చేయాలని పాఠశాల విద్యాశాఖ అధికారులను ఆదేశించింది. 
 
విద్యార్థులపై ఒత్తిడి రాకుండా, బడి సంచి భారాన్ని తగ్గించడంలో భాగంగా దీనిని అమలు చేయనున్నారు. ఇందులో భాగంగా ట్రైనింగ్ 1 నుండి 10వ తరగతి విద్యార్థుల కోసం 10 బ్యాగ్‌లెస్ రోజుల కోసం హ్యాండ్‌అవుట్‌తో ముందుకు వచ్చింది. 
 
ఈ బ్యాగ్ డే సందర్భంగా పలు యాక్టివిటీస్ పరిచయం చేస్తారు. ఈ రోజున తరగతుల వారీగా యాక్టివిటీ క్లాసులు వుంటాయి.
 
సెకండరీ పాఠశాల స్థాయి విద్యార్థులకు కృత్రిమ మేధస్సు, దాని అప్లికేషన్లు, అవకాశాల ప్రాథమిక అంశాలు కూడా పరిచయం చేస్తారు. అంతేగాకుండా ఫీల్డ్ విజిట్‌లు, మోడల్ అసెంబ్లీ, మోడల్ ఎన్నికలు, అవుట్ డోర్, ఇండోర్ కార్యకలాపాలు ఉన్నాయి.