మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : గురువారం, 3 ఫిబ్రవరి 2022 (10:34 IST)

ఉద్యోగుల పరస్పర బదిలీలకు టి. సర్కార్ గ్రీన్ సిగ్నల్

ఉద్యోగుల పరస్పర బదిలీలకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బదిలీ కోరుకునే ఉద్యోగులు మార్చి 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించింది సర్కార్. 
 
ఇక, ఉద్యోగులు మ్యూచువల్‌ను వెతుక్కోవడానికి నెల రోజుల అవకాశం ఉంటుంది. దీంతో, ఒక ప్రాంతంలో ఉద్యోగం చేయడం ఇష్టం లేని వారు.. మరో ప్రాంతంలో ఉద్యోగం చేస్తున్న వారిని.. పరస్పర అంగీకారంతో బదిలీపై తాను కోరుకున్న ప్రాంతానికి వెళ్లే అవకాశం ఉంటుంది.
 
కాగా, కొత్త జోనల్ వ్యవస్థలో బదిలీలపై తీవ్ర ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.. ఇప్పటికే ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.