సినారే జయంతి నాడు గవర్నర్ దత్తాత్రేయకు సన్మానం
జ్ఞానపీఠ పురస్కార గ్రహీత, పద్మభూషణ్ డాక్టర్ సి.నా.రె. గా పేరొందిన సింగిరెడ్డి నారాయణరెడ్డి జయంతి ఉత్సవాలను తెలంగాణాలో ఘనంగా నిర్వహించారు. హైదరాబాదులోని రవీంద్రభారతి ఆడిటోరియంలో సినారే జన్మదిన వేడుకులు జరిగాయి.
ఇందులో ముఖ్య అతిథిగా హర్యానా గవర్నర్, మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ పాల్గొన్నారు. తెలుగు కవి, సాహితీవేత్త. తెలుగు సాహిత్యానికి సినారే చేసిన ఎనలేని సేవలను సాహితీ ప్రముఖులు, నాయకులు కొనియాడారు. సి.నా.రే. 90 వ జయంతిని పురస్కరించుకుని సాహితీ అభిలాషకునిగా గవర్నర్ బండారు దత్తాత్రేయను సన్మానించారు.
సినీ నటి, బీజేపీ నేత విజయశాంతి, మాజీ ఎంపీ డాక్టర్, పి. విజయబాబు, డాక్టర్ అరిగెపూడి విజయ్ కుమార్, కైలాశ నగేష్, తదితరులు గవర్నర్ బండారు దత్తాత్రేయను సన్మానించారు. సి.నా.రే. జన్మదినం నాడు తనను సన్మానించడం, తన పూర్వ జన్మ సుకృతమని గవర్నర్ దత్తాత్రేయ అన్నారు.
1988లో విశ్వంభర కావ్యానికి ప్రతిష్ఠాత్మకమైన జ్ఞానపీఠ పురస్కారం సినారేకు లభించిందని, సినారె రాజ్యసభ సభ్యునిగా కూడా పనిచేశారని దత్తాత్రేయ గుర్తు చేశారు. తెలుగు చలన చిత్ర రంగంలో సి.నారాయణ రెడ్డి రాసిన పాటలు ఎంతో ప్రసిద్ధి చెందాయని, ఆయన సాహితీ సేవ ఎనలేదని గవర్నర్ దత్తాత్రేయ కొనియాడారు.