శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ivr
Last Modified: మంగళవారం, 21 మార్చి 2017 (21:18 IST)

ఐఏఎస్ కొడుకు సుక్రు-డ్రైవర్ నాగరాజు మేడపై అసహజ సంబంధం... అక్కడే తేడా వచ్చి హత్య...

హైదరాబాదులో ఈ నెల 17న హత్యకు గురైన డ్రైవర్ నాగరాజు హత్య మిస్టరీ వీడింది. ఈ హత్యను ఐఏఎస్ అధికారి వెంకటేశ్వర్లు కుమారుడు సుక్రూ వెంకట్ చేసినట్లు అంగీకరించాడు. సుమారు 24 గంటలపాటు ఐఏఎస్ వెంకటేశ్వర్లును పోలీసులు విచారించారు. అతని కొడుకు సుక్రూ వద్ద తమదైన

హైదరాబాదులో ఈ నెల 17న హత్యకు గురైన డ్రైవర్ నాగరాజు హత్య మిస్టరీ వీడింది. ఈ హత్యను ఐఏఎస్ అధికారి వెంకటేశ్వర్లు కుమారుడు సుక్రూ వెంకట్ చేసినట్లు అంగీకరించాడు. సుమారు 24 గంటలపాటు ఐఏఎస్ వెంకటేశ్వర్లును పోలీసులు విచారించారు. అతని కొడుకు సుక్రూ వద్ద తమదైన శైలిలో విచారణ జరిపారు. దీనితో వాస్తవాలు బయటకు వచ్చాయి.
 
హైదరాబాద్ డీసిపి నాగరాజు హత్య గురించి మీడియాకు వివరాలను చెప్పారు. ఆయన మాట్లాడుతూ... మార్చి 17వ తేదీన సుక్రూ,నాగరాజు ఇద్దరూ సాయి అపార్టుమెంటు మేడపైకి వెళ్లారు. అక్కడ ఇద్దరూ మద్యం సేవించారు. వారి మధ్య అసహజ సంబంధం వున్న కారణంగా సుక్రు పట్ల నాగరాజు అసభ్యంగా ప్రవర్తించాడు. దానితో సుక్రు అతడి తలపై బలంగా మోది హత్య చేశాడు. 
 
అతడిని హత్య చేసిన తర్వాత విషయాన్ని తన తండ్రికి చెప్పాడు. తండ్రి ఐఏఎస్ వెంకటేశ్వర్లు... బాడీని డిస్పోస్ చేయాలని సూచించాడు. అతడు చనిపోయాడో లేదో చూడమని మరోసారి చెక్ చేయమన్నాడు. పైకి వెళ్లిన అతనికి నాగరాజు రక్తపు మడుగులో విగతజీవిగా పడి కనిపించాడు. దానితో మళ్లీ తండ్రికి విషయాన్ని చెప్పడంతో అతడు కారు తీసుకుని అపార్టుమెంటు వద్దకు వచ్చాడు. వెంకటేశ్వర్లు కారు నుంచి గోనె సంచిని తీసుకుని శవాన్ని పైనుంచి తీసుకువచ్చేందుకు సుక్రు ప్రయత్నం చేశాడు. 
 
ఇంతలో ఏదో అలికిడి వస్తుండటంతో కింది అంతస్తులోని వారు అతడిని ప్రశ్నించారు. తను మూడో అంతస్తులో వుంటున్నానని వారితో చెప్పాడు. ఐతే మూడవ అంతస్తులోని వారిని విచారించగా అతడు అక్కడివాడు కాదని తేలింది. దీనితో వారంతా దొంగ అని అరవడంతో అతడు పారిపోయాడు. ఐతే మేడపైన హత్య జరిగినట్లు ఆ సమయంలో ఎవ్వరికీ తెలియలేదు. మరుసటి రోజు దుర్వాసన రావడంతో గమనించిన అపార్టుమెంట్ వాసులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత అతడు ఐఏఎస్ వెంకటేశ్వర్లు డ్రైవర్ నాగరాజు అని తేలడంతోనూ, సీసీ కెమేరాల్లోని దృశ్యాలతో నిందితులను అదుపులోకి తీసుకుని విచారించాం. ప్రస్తుతం వెంకటేశ్వర్లుతో సహా అతని కుమారుడు సుక్రును అరెస్టు చేశాం" అని తెలిపారు.