బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By
Last Updated : మంగళవారం, 13 నవంబరు 2018 (09:21 IST)

రేయ్.. నీ అయ్య... నన్నే టిక్కెట్ అడుగుతావా... స్టేషన్‌లో పడేసి చితక్కొడతా : ఖాకీ జులుం

సాధారణంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిస్తున్న ఆర్టీసీ బస్సుల్లో టిక్కెట్ లేకుండా ప్రయాణం చేస్తే నేరం. సామాన్య ప్రయాణికులు ఎవరైనా టిక్కెట్ లేకుండా ప్రయాణం చేస్తే వారిని పట్టుకుని జైలుకు పంపడం లేదా అపరాధం విధించడం జరుగుతుంది. 
 
కానీ, ట్రాఫిక్ పోలీసులు మాత్రం ఎపుడూ కూడా టిక్కెట్ తీసుకుని ప్రయాణించిన దాఖలాలు లేవు. దీన్ని కండక్టర్లు కూడా పెద్దగా పట్టించుకోరు. కానీ, నిబద్ధత కలిగిన కొందరు కండక్టర్లు మాత్రం టిక్కెట్ తీసుకోవాల్సిందేనంటూ పట్టుబడుతారు. అలాంటివారు మాత్రం ఖాకీ జులుం రుచిచూడాల్సిందే. 
 
తాజాగా హైదరాబాద్ నగరంలో టిక్కెట్ తీసుకోమన్న కండక్టర్‌ పట్ల ట్రాఫిక్ కానిస్టేబుల్ ఒెంటికాలిపై లేస్తూ అసభ్య పదజాలంతో దూషించాడు. అంతేనా.. స్టేషన్‌లో పడేసి చితక్కొడతానంటూ హెచ్చరించాడు. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
హైదరాబాద్, లక్డీకాపూల్‌లో ఆర్టీసీ బస్సు ఎక్కిన ట్రాఫిక్ కానిస్టేబుల్ టికెట్ తీసుకునేందుకు నిరాకరించాడు. టిక్కెట్ తీసుకోకుంటే బస్సు దిగాలని కోరిన కండక్టర్‌ని అసభ్య పదజాలంతో నోటికొచ్చినట్టు బూతులు తిట్టాడు. పోలీస్ స్టేషన్‌లో పడేసి చితక్కొడతానంటూ అతడిని బెదిరించాడు. 
 
ఇదంతా గమనించిన తోటి ప్రయాణికులు ట్రాఫిక్ పోలీస్ తీరును తప్పుబట్టి నిలదీశారు. టిక్కెట్ తీసుకోకపోవడమేకాకుండా, కండక్టర్‌‌పై మాటల దాడికి దిగడంపై కడిగిపరేశారు. దీంతో అసెంబ్లీ బస్టాప్ దగ్గర ఆ కానిస్టేబుల్ దిగకతప్పలేదు. ఇదంతా ఓ ప్రయాణీకుడు వీడియో తీయడంతో అది కాస్తా వైరల్‌ అయింది.