శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By selvi
Last Updated : శుక్రవారం, 21 సెప్టెంబరు 2018 (18:29 IST)

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు- ఆమ్రపాలికి కొత్త బాధ్యతలు

తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల రాష్ట్ర ఎన్నికల సంయుక్త ప్రధానాధికారిగా ఆమ్రపాలి నియామకానికి కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు శుక్రవారం సిఇసి ఉత్తర్వులు జారీ చేసింది.

తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల రాష్ట్ర ఎన్నికల సంయుక్త ప్రధానాధికారిగా ఆమ్రపాలి నియామకానికి కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు శుక్రవారం సిఇసి ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో ఐటి సంబంధిత అంశాలను జిహెచ్‌ఎంసి అడిషనల్ కమీషనర్ ఆమ్రపాలి పర్యవేక్షించనున్నారు. 
 
ఇప్పటికే అసెంబ్లీ రద్దుతో తెలంగాణలో ముందస్తు ఎన్నికల హడావుడి మొదలైంది. ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల కోసం సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం కూడా కసరత్తులు ప్రారంభించింది. అందుకోసం మరో ఐపిఎస్ అధికారికి ఎన్నికల నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది.
 
ప్రస్తుతం జీహెచ్ఎంసీ అడిషినల్ కమీషనర్‌గా వున్న ఆమ్రపాలి రాష్ట్ర ఎన్నికల సంయుక్త ప్రధానాధికారిగా నియమితులయ్యారు. ఆమ్రపాలిని ముఖ్యమైన ఐటీ సంబంధిత అంశాలను పర్యవేక్షణ కోసం జాయింట్ సీఈవోగా నియమించినట్లు సమాచారం.