శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : శుక్రవారం, 6 ఆగస్టు 2021 (17:15 IST)

కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి ఇంద్రకరణ్

నిర్మల్ నియోజకవర్గం లక్ష్మణ చందా మండలానికి చెందిన 64 మందికి, మామడ మండలానికి చెందిన 21 మంది లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ చెక్కులను కనకపూర్ గ్రామంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోన విపత్కర పరిస్థితులు ఎదురైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమ పథకాలను ఆపడం లేదని అన్నారు.

పేద కుటుంబాలకు ఆడబిడ్డ పెళ్లి భారం కాకూడదని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్థిక భరోసా కలిపించారని తెలిపారు.. రైతులకు రూ.50 వేల రుణమాఫీ చేయడంతో పాటు 57 ఏండ్లు నిండిన వారికి పింఛన్ అందించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.