మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By srinivas
Last Modified: గురువారం, 2 ఆగస్టు 2018 (17:43 IST)

నువ్వేమైనా నా మొగుడివా? సహజీవనం చేసిన వ్యక్తిని చెప్పుతో కొట్టిన మహిళ

సహజీవనం చేసిన వ్యక్తిని చెప్పుతో కొట్టిందో మహిళ. వనస్థలిపురం పోలీస్ స్టేషన్‌లో ఓ మహిళ హల్చల్ చేసింది. తనతో గతంలో సహజీవనం చేసిన వ్యక్తిని పోలీస్ స్టేషన్ లోనే చెప్పుతో కొట్టి హంగామా సృష్టించింది. సహజీవనం చేస్తున్న టైంలో సదరు మహిళ అతడికి అప్పుగా కొంత డబ

సహజీవనం చేసిన వ్యక్తిని చెప్పుతో కొట్టిందో మహిళ. వనస్థలిపురం పోలీస్ స్టేషన్‌లో ఓ మహిళ హల్చల్ చేసింది. తనతో గతంలో సహజీవనం చేసిన వ్యక్తిని పోలీస్ స్టేషన్ లోనే చెప్పుతో కొట్టి హంగామా సృష్టించింది. సహజీవనం చేస్తున్న టైంలో సదరు మహిళ అతడికి అప్పుగా కొంత డబ్బు ఇచ్చింది.
 
ఐతే సహజీవనం బ్రేకప్ అయ్యాక తన డబ్బులు తనకు ఇవ్వాలని అడుగుతూ వుంది. అతడు ఎంతకూ ఇవ్వకపోయేసరికి పోలీసు కేసు పెట్టింది. అప్పుగా డబ్బులు తీసుకుని తిరిగి ఇవ్వకుండా తప్పించుకుని తిరుగుతున్నాడని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీస్ స్టేషన్‌కు వచ్చిన అతగాడిని చెప్పుతో కొడుతూ నువ్వు ఏమన్నా నా మొగుడివా? నా డబ్బులు తిరిగి ఇవ్వవా అంటూ నిలదీసింది. పోలీసుల ముందే అతడిని చెప్పుతో చితకబాదడంతో అక్కడివారు అవాక్కయ్యారు.