వచ్చే వర్షాకాలం నాటికి నాలా పూర్తి.. మంత్రి కేటీఆర్
వచ్చే వర్షాకాలం నాటికి మొదటి దశ నాలా పనులు మొత్తం పూర్తి చేసి ముంపు సమస్య తొలగిస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. నాలా పనులు జనవరి చివరి నాటికి పూర్తి అవుతాయని చెప్పారు.
వచ్చే ఎన్నికల తర్వాత మెట్రో రెండో ఫేజ్ కింద నాగోల్ టూ ఎల్బీనగర్ లైన్ పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఎల్బీ నగర్ నుంచి హయత్ వరకు మెట్రో రైలు తీసుకువస్తామన్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో మంగళవారం ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పర్యటించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, హైదరాబాదులో పచ్చదనం కనిపిస్తోందన్నారు. 240 కోట్ల మొక్కలతో రాష్ట్రమంతా హరితహారం, రాష్ట్రంలో 7.7 శాతం వృద్ధితో 31.7 శాతం గ్రీన్ కవర్ అయ్యిందన్నారు.