శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By శ్రీ
Last Modified: బుధవారం, 24 జులై 2019 (17:29 IST)

బిగ్ బాస్ చానెల్‌కు పోలీసులు నోటీసులు..

స్టార్ మా అత్యంత ప్రాధాన్యంగా ప్రారంభించిన బిగ్ బాస్ సీజన్ 3ని పలు వివాదాలు వెంటాడుతున్నాయి. యాంకర్ శ్వేతారెడ్డి ‘బిగ్ బాస్’ ఒప్పంద సమయంలో కొందరు బిగ్ బాస్ టీం కో-ఆర్డినేటర్లు కాస్టింగ్ కౌచ్‌కు పాల్పడ్డారని పలు ఆరోపణలు చేశారు. 
 
బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో బిగ్ బాస్ ఇన్‌చార్జి శ్యాంతో పాటు రవికాంత్, రఘు, శశికాంత్‌ల పైన కేసు నమోదు చేశారు. కేసు విచారణ చేపట్టిన బంజారహిల్స్ పోలీసులు 
స్టార్ మా కార్యాలయానికి నోటీసులు పంపిచారు. 
 
బిగ్ బాస్ ఎంపికకు సంబంధించిన నియమాలు, నిబంధనలతో పాటు శ్యాం, రవికాంత్, రఘు, శశికాంత్‌ల యొక్క పాత్ర బిగ్ బాస్ షోలో ఏమిటి అనే అంశాలపై మూడు రోజుల్లో సమాధానం ఇవ్వాలని నోటీసులో సూచించారు. పోలీసులు అందించిన నోటీసులపై చర్చించి రెండు రోజుల్లో సమాధానమిస్తామని పోలీసులకు స్టార్ మా నిర్వాహకులు తెలయజేశారు.