శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ivr
Last Modified: శనివారం, 29 ఏప్రియల్ 2017 (15:46 IST)

తెలంగాణాలో ఇలాక్కూడా జరుగుతుందా? షాక్ తింటున్న గులాబీ నేతలు...

రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఈ ఒక్క పేరే తెరాస నాయకులకు ముచ్చెమటలు పట్టిస్తోంది. ఏదో కేసుల్లో ఇరుక్కున్నప్పటి నుంచి ఆయన మరీ వార్తల్లో నిలిచే వ్యక్తిగా మారారు. తెలంగాణ తెదేపాకు ఆయనే ఆయువుపట్టుగా మారారు. తెరాసను ఎక్కడికెళ్లినా కడిగిపారేయడమే లక్ష్యంగా ఆయన ముం

రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఈ ఒక్క పేరే తెరాస నాయకులకు ముచ్చెమటలు పట్టిస్తోంది. ఏదో కేసుల్లో ఇరుక్కున్నప్పటి నుంచి ఆయన మరీ వార్తల్లో నిలిచే వ్యక్తిగా మారారు. తెలంగాణ తెదేపాకు ఆయనే ఆయువుపట్టుగా మారారు. తెరాసను ఎక్కడికెళ్లినా కడిగిపారేయడమే లక్ష్యంగా ఆయన ముందుకు వెళుతున్నారు. తాజాగా తెలంగాణలో తలెత్తిన మిర్చి గిట్టుబాటు సమస్యపై రేవంత్ రెడ్డి పోరాటం చేస్తున్నారు. 
 
మిర్చి రైతుల వద్దకు వెళ్లి పరామర్శలు చేస్తున్నారు. దీనితో కొంతమంది తెరాసకు చెందిన వారు కూడా రేవంత్ రెడ్డికి మద్దతు పలకడం గులాబీ పార్టీకి షాకింగ్ గా మారుతోంది. తాజాగా తాండూరులో జరిగిన బహిరంగ సభలో రేవంత్ సమక్షంలో అటు కాంగ్రెస్ పార్టీ, ఇటు తెరాస పార్టీ నుంచి పలువురు నేతలు తెదేపా తీర్థం పుచ్చుకోవడం చర్చనీయాంశంగా మారింది. 
 
కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులంటే సర్లే అనుకోవచ్చు కానీ తెరాస పార్టీకి చెందినవారూ కూడా చేరుతున్నారంటే కాస్త ఆలోచించాల్సిందే. అందుకే ఇప్పుడు తెలంగాణలో ఇలాక్కూడా జరుగుతుందా అనే చర్చించుకుంటున్నారు. ఎక్కడో తేడా వచ్చినట్లుందే అనుకుని తెరాస ఓసారి చెక్ చేసుకుని చూచుకుంటే మంచిదేమో...?