గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ivr
Last Updated : గురువారం, 12 అక్టోబరు 2017 (21:40 IST)

గజల్ చారిటబుల్ ట్రస్ట్ - సేవా శిరోమణి పురస్కారాలు

41 వసంతాల గానోత్సవాల సందర్భంగా, డా. గజల్ శ్రీనివాస్ జన్మదినాన్ని పురస్కరించుకుని 14 అక్టోబర్ 2017 సాయంత్రం 5.30కు హైదరాబాద్ అమీర్ పేట లోని సారధి స్టూడియో ప్రివ్యూ ధియేటర్‌లో సేవా రంగానికి, సాహితీ రంగా

41 వసంతాల గానోత్సవాల సందర్భంగా, డా. గజల్ శ్రీనివాస్ జన్మదినాన్ని పురస్కరించుకుని 14 అక్టోబర్ 2017 సాయంత్రం 5.30కు హైదరాబాద్ అమీర్ పేట లోని సారధి స్టూడియో ప్రివ్యూ ధియేటర్‌లో సేవా రంగానికి, సాహితీ రంగానికి మరియు ప్రపంచ శాంతి కోసం కృషి చేస్తున్న ప్రముఖులకు “సేవా శిరోమణి పురస్కారాల”ను తమిళనాడు మాజీ గవర్నర్ శ్రీ కె. రోశయ్య గారి చేతుల మీదుగా ప్రదానం చేయనున్నట్లు గజల్ చారిటబుల్ ట్రస్ట్ కార్యదర్శి శ్రీమతి కె.ఎ.బి. సురేఖ ఒక ప్రకటనలో తెలిపారు.
 
ఇందులో సేవా రంగానికి గాను స్వచ్చ ఆంధ్ర, స్వచ్చ భారత్‌కు కృషి చేస్తున్న శివ స్వచ్చంద సేవా సంస్థ చైర్మన్ శ్రీ వి వి శివరామరాజు, MLA, ఉండి, శివశక్తి గ్రూప్ చైర్మన్ శ్రీ జి వి ఆంజనేయులు, MLA, వినుకొండ, ఉద్దానం ఫౌండేషన్ చైర్మన్ శ్రీ పిరియ సాయిరాజ్, Ex.MLA ఇచ్చాపురం, సీల్ వెల్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ బి సుబ్బారావు లను “సేవా శిరోమణి పురస్కారంతో”ను, సాహితీ రంగానికి గాను భువనవిజయం (తెలుగు సాహిత్య వేదిక)శ్రీ వంకయలపాటి చంద్రశేఖర్‌ను “సాహితీ సేవా శిరోమణి పురస్కారంతో”ను మరియు ప్రపంచ శాంతికి కృషి చేసిన  Mr. జియాఉల్ రెహమాన్, మజారే షరీఫ్, ఆఫ్ఘానిస్తాన్‌ను “ఇండో-ఆఫ్ఘాన్ స్నేహ పురస్కారం” తోను సత్కరించనున్నట్లు తెలిపారు. 
 
ఈ కార్యక్రమంలో శ్రీ రెంటాల శ్రీ వెంకటేశ్వరరావు రచించి డా. గజల్ శ్రీనివాస్ గారికి అంకితం చేయనున్న “డా. రెంటాల గజళ్ళు-గీతాలు ఒక మంత్రశాల” పుస్తక ఆవిష్కరణ ఉంటుందని తెలిపారు.